కుమారి 21 ఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో రాజ్ తరుణ్. కెరీర్ మొదట్లో మంచి విజయాలే అందుకున్నాడు. కాని ఇప్పుడు మాత్రం అతని పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల కాలంలో రాజ్ తరుణ్‌కి ఒక్కటంటే ఒక్క హిట్ పడడం లేదు. మంచి సక్సెస్ కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. అయితే తాజాగా రాజ్ తరుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో బైట్ కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఇందులో ఆయన పీటల దాకా వచ్చిన పెళ్లి క్యాన్సిల్ అయిందని, ఒసేయ్ నీ అంతుచూస్తా అని చాలా ఆవేశంగా మాట్లాడాడు.
వీడియోలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. “ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేయడానికి ఒక కారణం ఉందండీ. నా జీవితంలో ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటది అనుకోలా, చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అమ్మాయిలతో మాట్లాడుతుంటే నేను అమ్మ చెప్పిన కొత్తిమీర, కరివేపాకు తెచ్చేవాడిని. అలాంటి నాకు నా పేరెంట్స్ ఒక పెళ్లి నిశయించి, ముహూర్తం కూడా పెట్టారు.అంతా ఆనందంగా జరుగుతుంది అనుకున్న సమయంలో.. పెళ్లికూతురు లెటర్ రాసి ఎవరితోనో లేచిపోయింది. నా కుటుంబానికి ఉన్న పరువు మొత్తం తీసేసింది.
కాబట్టి ఆ అమ్మాయిని వదిలేది లేదు, ఆమె ఫోటో రేపు షేర్ చేస్తాను, ఎక్కడైనా కనబడితే చెప్పండి” అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుకి ఇకలేదు అనే హాష్ టాగ్ ని జతచేశాడు. దీంతో ఇది తన కొత్త సినిమా ప్రమోషన్ అని తెలుస్తుంది. ఇలా వెరైటీగా ప్రమోషన్ చేసినందకు విశ్వక్ సేన్ చాలా ఇబ్బందులు పడ్డాడు కాని అతని సినిమాకు పబ్లిసిటీగా మారింది . మరి రాజ్ తరుణ్ ఏ సినిమా కోసం ఇలా చేశాడో..? అది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఈ ఏడాది మొదటిలో ‘స్టాండ్ అప్ రాహుల్’ వంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ తో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…