Nagarjuna : అఖిల్ కోసం షూటింగ్ మానేసి 6 నెల‌లు అమ‌ల‌తోనే ఉన్నా.. నాగార్జున ఎమోష‌న‌ల్ కామెంట్స్..

Nagarjuna : బిగ్ బాస్ సోహెల్, రూప హీరోహీరోయిన్లుగా వస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో శనివారం సాయంత్రం జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు నాగార్జున మైక్ అందుకున్న‌ప్పుడు ఆయ‌న‌ని యాంక‌ర్ మంజుల ఓ ప్ర‌శ్న అడిగింది. ‘ఆగస్టు 18న డెలివరీ కాబోతోంది కాబట్టి.. మగబిడ్డ పుడతాడా? ఆడబిడ్డ పుడుతుందా? పుట్టే బిడ్డకు ఏం పేరు పెడతారు?’ అని కింగ్‌ను మంజూష ప్రశ్నించారు.

వెంటనే నాగార్జున.. ‘ఎవరికి’ అని పంచ్ వేశారు. అంటే డెలివరీ ఎవరికి అని. వెంటనే.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌కి సార్’ అని మంజూష సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. అయితే, ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌కి హిట్టు పుట్టాలి’ అని నాగార్జున అన్నారు. అంటే, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక తన జీవితంలో అత్యద్భుతమైన క్షణాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు హీరో నాగార్జున. అఖిల్, అమల గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు తోడుగా గడిపిన క్షణాల్ని జీవితంలో మరిచిపోలేనన్నాడు. దాదాపు 30 ఏళ్ల కిందటి ఆ జ్ఞాపకాల్ని బయటపెట్టాడు. “హలో బ్రదర్ షూటింగ్ అప్పుడే పూర్తయింది. అమల 9 నెలల గర్భంలో చివరి 6 నెలలు అమలకే కేటాయించాను. ప్రతి నిమిషం ఆమెతోనే ఉన్నాను. చివరికి డెలివరీ రూమ్ లో కూడా అమల చేయి పట్టుకొనే ఉన్నాను. నా జీవితంలో అది ఓ అరుదైన గొప్ప అనుభవం.”

Nagarjuna emotional comments about akhil
Nagarjuna

ఇలా అఖిల్ పుట్టినప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు నాగ్. అమ్మతనం అనేది గొప్ప వరమని, ఆ టైమ్ లో వాళ్లకు అండగా ఉండడం అవసరం అన్నాడు. అయితే పురుషుడు గర్భం దాల్చడం అనే కొత్త కాన్సెప్ట్ తో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా వస్తుందని తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు నాగ్. ఈ సినిమాకు సంబంధించి ఏడాదిన్నర కిందటే 10 నిమిషాల వీడియో చూశాడట. సినిమా కూడా చూస్తానని అప్పుడే మాటిచ్చాడట. మొత్తానికి త‌న అభిమాని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగార్జున హాజ‌రై సంద‌డి చేయ‌డం విశేషం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago