Vaishnavi Chaitanya : సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది వైష్ణవి చైతన్య. యూట్యూబ్ ప్లాట్ ఫాంపై.. షార్ట్ ఫిల్మ్స్‌తో.. తనేంటో ప్రూఫ్ చేసుకున్నారు. ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై చిన్నా.. చితకా క్యారెక్టర్స్‌తో.. తన ఫిల్మ్ కెరీర్ బిగిన్ చేసిన ఈ అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో చేసిన కూడా.. సరైన బ్రేక్ రాలేదు. సినీ పరిశ్రమలో అష్టకష్టాలు పడుతూ వచ్చారు. ఎట్టకేలకి బేబీ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి.. ఒక్కసారిగా ఇండస్ట్రీ సెన్సేషన్ అయిపోయారు. అందర్నీ తనవైపే తిరిగేలా చేసుకుంటూ.. ఇప్పుడిక వరుసగా బంపర్ ఆఫర్ కొట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ రేసులో ఇస్మార్ట్‌గా దూసుకుపోతున్నారు.
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో వైష్ణవికి ఛాన్స్ దొరికినట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా వైష్ణవిని పూరీ సెలక్ట్ చేశారట. తన పక్కన హీరోయిన్‌గా వైష్ణవిని తీసుకోమని పూరీకి స్వయంగా రామ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పూరీ కూడా ఆమె యాక్టింగ్‌కి ఇంప్రెస్ అయి ఓకే చేసేసినట్లు టాక్ నడుస్తుంది. అయితే ఇంకా దీనిపై అఫీయల్‌గా ప్రకటన రావాల్సి ఉన్నా కూడా ఈవిషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అదే నిజమైతే వైష్ణవి కెరీర్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే ‘డబుల్ ఇస్మార్ట్’ను పాన్ ఇండియా లెవెల్‌లో చిత్రీకరిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కూడా భారీ రేంజ్‌లోనే ఈ కథ రాశారట. ఇక భారీ బడ్జెట్‌తో టాప్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తారని టాక్. ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ పాత్రకు మించి ఇందులో ఇంకా మాస్‌గా కనిపించనున్నాడని అంటున్నారు. మహా శివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీ రోల్‌లో కనిబించబోతున్నట్లుగా ప్రకటిస్తూ ఆయన లుక్ రివీల్ చేశారు. ఇది బాగా ఆకట్టుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…