Naga Chaitanya : గత కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీ హీరోలకు సరైన విజయాలు లేక సతమతమవుతున్నారు. నాగార్జున మొదలుకొని నాగ చైతన్య, అఖిల్, సుషాంత్ ఇలా వీరందరికీ వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. దీనింతటికీ కారణం వీరి సినిమా టైటిల్స్ అనే కొందరు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య హీరోగా చేసిన థాంక్యూ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్న విషయం కూడా ఈ మధ్యే తెలిసింది. ఈ సినిమాను తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. కొన్ని వర్గాల నుండి అందిన సమాచారాన్ని బట్టి ఈ మూవీకి 302 అనే టైటిల్ ను దాదాపుగా ఖరారు చేసినట్టు వినిపిస్తుంది. అయితే ఈ నాగ చైతన్య సినిమాకు ఈ పేరు పెట్టడం పట్ల అక్కినేని అభిమానులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా చెత్త టైటిల్స్ పెట్టడం వల్లనే అక్కినేని ఫ్యామిలీలో సినిమాలు సరైన విజయం సాధించలేకపోతున్నాయని వారు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో అక్కినేని కుటుంబం నుండి వచ్చిన సినిమాలు కూడా ట్రైలర్ బాగున్నప్పటికీ పేరు బాగా లేకపోవడం వల్ల ప్రేక్షకులలో సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించలేకపోయాయని అంటున్నారు.
ఈ క్రమంలోనే నాగార్జున నుండి వచ్చిన ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ నాగ చైతన్య థాంక్యూ సినిమాలు కూడా హైప్ తీసుకురావడంలో రావడంలో విఫలమై చివరకు ఘోరంగా పరాజయం అయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఇదే విధంగా నాగ చైతన్య 22 వ చిత్రం విషయంలో కూడా 302 అనే టైటిల్ పై అక్కినేని అభిమానులు అయిష్టంగా ఉన్నారని అంటున్నారు. దానికి బదులుగా ఏదైనా పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా 302 పేరుతో ఇదివరకే ఒక లో బడ్జెట్ మూవీ ఉందని అంటున్నారు, నాగ చైతన్య ఇప్పటికైనా తన తప్పులనుండి నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు ప్రియమణి ని తీసుకోవడం పట్ల కూడా కొందరు అభిమానులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తి ని తెలుపుతున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య , ప్రియమణి లతో పాటు తమిళ నటులు జీవా, అరవింద్ స్వామి ఇతర ముఖ్య పాత్రలు చేయనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…