Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి సినిమా పరాజయాలు కొత్తేం కాదు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చూసిన ఆయన ఘోరమైన ఫ్లాప్ లు కూడా చూసాడు. కొన్ని సందర్భాల్లో తన ఫ్లాప్ సినిమాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఫ్లాప్ సినిమా తీసిన దర్శకులతో మళ్లీ మళ్లీ సినిమాలు కూడా తీసిన చరిత్ర ఆయనది. కానీ ఆచార్య డిజాస్టర్ తరువాత ఆ చిత్ర దర్శకుడి విషయంలో ఆయన ప్రవర్తన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఆచార్య ఫ్లాప్ తరువాత చిరంజీవి ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ దర్శకులు సెట్ లో అప్పటికప్పుడే మాటలు రాయడం గురించి విమర్శించాడు. అయితే ఇది ఒక సినిమాను ఉద్దేశించి అనలేదని ఆయన చెప్పినప్పటికీ చాలా మంది కొరటాల శివ ను టార్గెట్ చేసారని భావించడం జరిగింది. ఇంకా చాలా సందర్భాల్లో ఆయన ఆచార్య సినిమా గురించే ప్రస్తావించడం, పరోక్షంగా దర్శకుడిని నిందించడం కూడా చేసాడు. కానీ ఇదివరకెప్పుడూ లేని విధంగా తన సినిమా ఫ్లాప్ విషయంలో చిరంజీవి ఇలా పదే పదే దాని గురించి ప్రస్తావించి ఎందుకు కుమిలిపోతున్నాడని కొందరు తమ సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ తను రామ్ చరణ్ ఇద్దరూ కలిసి 80 శాతం డబ్బులను ఆచార్య డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా కొన్నవారికి తిరిగి ఇచ్చేసినట్లు తెలిపాడు. అయితే చిరంజీవి, రామ్ చరణ్ లు మొదటిసారి ఎక్కువ సేపు తెరపై కనిపించేలా కలిసి చేసిన ఆచార్య సినిమాను చిరంజీవి చాలా వ్యక్తిగతంగా తీసుకోవడం, ఎంతో నమ్మకంతో తీసిన సినిమా కావడంతో ఆచార్య ఫ్లాప్ ను ఆయన తట్టుకోలేక పోతున్నారని అంటున్నారు. ఎంతో మనసు పెట్టి తీసిన చిత్రం కావడంతో దాని నుండి బయటకు రాలేకపోతున్నారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
అయితే కొరటాల శివకు సినిమా తీసే విషయంలో ఎవరికీ ఇవ్వనంత స్వేఛ్చను ఇచ్చినప్పటికీ , మొత్తం షూటింగ్ అయిపోయిన తరువాత కూడా కాజల్ అగర్వాల్ నటించిన సీన్లను కత్తిరించడానికి ఒప్పుకున్నప్పటికీ అతను ఇలాంటి సినిమా తీయడం చిరుని చాలా బాధించిందని కొందరు అంటున్నారు. ఇక ఇప్పటికైనా చిరంజీవి ఆచార్య అనే పీడకల నుండి బయటకు రావాలని ఆయనకు దగ్గరగా ఉండేవారు సలహా ఇస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…