Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు నటుడు, నిర్మాత, జడ్జిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన నటుడిగా, నిర్మాతగా పెద్దగా ఎదగలేకపోయారు. నిర్మాతగా అయితే ఆయనకు చాలా నష్టాలు వచ్చాయనే చెప్పాలి. అయితే ఆయనకు ఎప్పటికీ మరవలేని జ్ఞాపకాలు మిగిల్చింది ‘ఆరెంజ్’ మూవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తే ఈ సినిమా కాస్తా అట్టర్ ప్లాప్ కావడంతో అప్పులపాలయ్యారు నాగబాబు. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆరెంజ్ సినిమా రూపొందగా, దీని కోసం భారీగా ఖర్చు చేశారు మెగా బ్రదర్.
అన్ని హంగులతో నిర్మించి, భారీ అంచనాల నడుమ చిత్రాన్ని విడుదల చేయగా, ఈ మూవీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఫ్లాప్ సినిమాగా నిలిచింది.. దీంతో నాగబాబుకు కోలుకోలేని దెబ్బ పడింది. కానీ, క్రమంగా ఆ ఇబ్బందులన్నీ అధిగమిస్తూ ఇప్పుడు తిరిగి ఫైనాన్సియల్‌గా స్ట్రాంగ్ అయ్యారు నాగబాబు. అయితే ఆ సమయంలో చిరంజీవి తన అప్పులో సగం తీర్చాడు అని చెప్పిన నాగబాబు.. ఆరెంజ్ సినిమాకు గాను రామ్ చరణ్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, కాకపోతే భవిష్యత్‌లో ఎప్పటికైనా ఆ రెమ్మ్యూనరేషన్ చెల్లిస్తానని కూడా అన్నాడు.
అయితే రీసెంట్‌గా ఆరెంజ్ సినిమా విడుదలై 12 ఏళ్లు అయింది. ఈ క్రమంలో రీరిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు రాగా, దీనిపై క్లారిటీ ఇస్తూ.. నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. క్లాసికల్ మూవీ ఆరెంజ్ అద్బుతమైన మ్యూజిక్, మనసు దోచే ప్రేమకథతో ఎంతో మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రం 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల డిమాండ్ మేరకు సరైన సమయంలో ఆరెంజ్ రీ రిలీజ్ చేస్తామని ట్వీట్ చేయగా, ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే నాగబాబును ఆరంజ్ అంతగా ఇబ్బంది పెట్టిన, అవన్నీ మర్చిపోయిన నాగబాబు దాన్ని కల్ట్ క్లాసిక్ అంటుండడం విశేషం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…