Mutyala Muggu Movie : దర్శకుడు బాపు.. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని, ఆ కళాఖండంలో తాము కూడా ఒక భాగం కావాలని నటీనటులంతా అనుకుంటారు. ఆయన తీసిన అద్భుతమైన కళాత్మక చిత్రాలు చూసి జనాలు అప్పట్లో ఆశ్చర్యపోయేవారు. మూవీలో సహజత్వం ఉట్టిపడేలా బాపు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన అప్పట్లో వర్తమాన నటీనటులతో తీసిన గొప్ప చిత్రం ముత్యాల ముగ్గు. ఇందులో స్టార్స్ ఎవరూ లేరు. సుమారుగా ఈ చిత్రం తీయడానికి మేకర్స్ కు రూ.12 లక్షలు ఖర్చు అయిందట.
ఇక ఈ సినిమా అప్పట్లోనే రూ.2 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీధర్ హీరోగా నటించగా సంగీత హీరోయిన్ గా నటించారు. అంతే కాకుండా అప్పటికి పెద్దగా గుర్తింపు లేని రావుగోపాల్ రావును విలన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో నటీనటులకు మేకప్ లేకుండానే తెరకెక్కించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా నటీనటులకు మేకప్ లేదని తెలియడంతో సినిమాను కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ సినిమా పూర్తయి మొదటి కాపీ రాగేనే ఎన్టీరామారావుకు చూపించారు.
సినిమా చూసిన ఎన్టీఆర్ మా రోజులు గుర్తుచేశావ్ బ్రదర్ అంటూ బాపూను అభినందించారట. అయినప్పటికీ సినిమాపై అంచనాలు లేకపోవడంతో తక్కువ థియేటర్ లలో విడుదల చేశారు. అవి కూడా పాత థియేటర్ లలోనే సినిమాను వేసుకున్నారు. మహా అయితే ఈ సినిమా 4 రోజులు ఆడుతుందేమో అనే భావనలో చిత్ర యూనిట్ ఉందట. సినిమాకు పబ్లిసిటీ కూడా చేయలేదు. కానీ ఈ సినిమాకు వస్తున్న టాక్ చూసి ఆశ్చర్యపోయారు. ఫస్ట్ వీక్ నుండి కలెక్షన్ ల జోరు పెరిగింది. ప్రేక్షకులకు తెగ నచ్చడంతో కోట్లల్లో వసూలు చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…