Ankusham Fight Scene : యాంగ్రీయంగ్‌మెన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు రాజశేఖర్. ఒకప్పుడు ఆయన సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉండేది. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న రాజశేఖర్ అంకుశం అనే సినిమాతో ఎక్కువ క్రేజ్ అందిపుచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ తెరకెక్కించారు. అయితే కోడి రామకృష్ణకి ఓ సారి పోలీసుల కన్నా రాజకీయ నాయకులకే ఎక్కువ గౌరవం ఎందుకు ఇస్తున్నారు, దానిని మార్చాలని అనుకున్నారట. వెంటనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రాజశేఖర్ కు కథను వినిపించారు. కథ విన్న వెంటనే బాగా నచ్చడంతో రాజశేఖర్ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడతా అని చెప్పారట.
విలన్ పాత్రకోసం రామిరెడ్డిని ఎంపిక చేయగా, షూటింగ్ జరుగుతున్న సమయంలో రామిరెడ్డి అక్కడ తిరుగుతూ కనిపించాడు. దాంతో తన సినిమాకు అతడు విలన్ గా సెట్ అవుతాడని అనిపించింది. ఇక విలన్ గా చేస్తావా అని అడగ్గానే నటిస్తానని ఒప్పుకున్నాడు. కానీ ఫస్ట్ సీన్ లో చార్మినార్ వద్ద బట్టలు ఊడదీసి రామిరెడ్డిని పోలీసులు కొట్టేసీన్. ఆ సీన్ లో నటించలేక నేను చేయలేనని రామిరెడ్డి చెప్పేశాడు. అయితే ఈ సినిమా నీకు ఎంతో పాపులారిటీ తీసుకొస్తుందని చెప్పడంతో ఓకే అన్నాడట.ఇక సినిమా షూటింగ్ జరుగుతన్నసమయంలో రాజశేఖర్ కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడట.
రామిరెడ్డిని రాజశేఖర్ రెడ్డి బట్టలు ఊడదీసి కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సి ఉండగా, సీన్ జరుగుతున్నప్పుడు రాజశేఖర్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే కొట్టాడు. దాంతో రామిరెడ్డి బెదిరిపోగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అతడికి ధైర్యం చెప్పారట. అలా తెరకెక్కిన అంకుశం రామిరెడ్డికి విలన్ గా, రాజశేఖర్ కు హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా, రామిరెడ్డి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 250కి పైగా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో ఒసేయ్ రాములమ్మ, అనగనగా ఒక రోజు, అమ్మోరు, పెద్దరికం, జగదీక వీరుడు అతిలోక సుందరి తదితర చిత్రాల్లో నటించారు. స్పాట్ పెడతా అనే ఆయన డైలాగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…