Sai Pallavi : సాయిపల్లవి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. తనకు కథ నచ్చకపోతే అవతల వ్యక్తి స్టార్ హీరో అయినా సరే.. ఆ మూవీని రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి. కేవలం ఆమె కోసమే థియేటర్ కి వచ్చే ఫ్యాన్స్ ఉండడం విశేషం.
ఇప్పుడు సాయిపల్లవికి ఏవిధంగా క్రేజ్ ఉందో అప్పట్లో విజయశాంతికి కూడా అలాగే ఉండేది. చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన హీరోయిన్. అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది. ఓసేయ్ రాములమ్మా తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డున్నీ బద్దలు కొట్టింది. అప్పట్లో విజయశాంతిని కూడా లేడీ సూపర్ స్టార్ అని పిలిచేవారట. ఇప్పుడు సాయి పల్లవిని కూడా అలాగే సంబోధిస్తుంటారు.
సాయిపల్లవికి ముందు తరువాత చాలామంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమె అంత క్రేజ్ ఏ హీరోయిన్‌కు రాలేదు. సాయిపల్లవికి పెద్ద పెద్ద హీరోల సరసన నటించే అవకాశం రానప్పటికీ ఆ స్థాయిలో పాపులారీటిని సంపాదించుకోవడం మాత్రం సాయిపల్లవికే సాధ్యమని చెప్పవచ్చు. ఈమె తన ఒక్క సినిమాకు 2 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటుంది. ఇక హీరోయిన్ సాయిపల్లవికి ఉన్న క్రేజ్ చూస్తే స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి అప్పట్లో విజయశాంతికి ఉన్న క్రేజ్ ఇప్పుడు సాయిపల్లవికి దక్కిందనే చెప్పవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…