Chatrapathi Movie : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగిని ముద్ర వేసుకున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో హాలీవుడ్ ప్రముఖుల విమర్శలు కూడా పొందాడు. అయితే రాజమౌళి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉండగా, అందులో ఛత్రపతి కూడా ఒకటి. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ‘ఛత్రపతి’ సినిమా స్టార్ హీరోగా అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆరో చిత్రం ‘ఛత్రపతి’. దర్శకుడిగా రాజమౌళికి ఇది 4వ మూవీ. నితిన్‌తో ‘సై’ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
రాజమౌళి ప్రభాస్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటుండగా, పలుమార్లు అది సాధ్యం కాలేదు. అయితే చివరిగా ఛత్రపతి పేరుతో సినిమా చేశాడు. అమ్మ సెంటిమెంట్ మరియు యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని చాలా సీన్లు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. ‘ఛత్రపతి’ సినిమాకు రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. కీరవాణి సంగీతం అందించారు. బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మించారు. శ్రియ కథానాయికగా నటించారు.
సినిమాలో కాట్రాజ్, ప్రభాస్ ల మధ్య ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. కాట్రాజ్ పాత్ర కోసం రాజమౌళి ముందుగా కొంతమందిని స్క్రీన్ టెస్ట్ చేసిన, ప్రభాస్ కటౌట్ కు సరిపోయేలా ఎవరు దొరకలేదు. చివరికి సై సినిమాలో 10 మందిలో ఒకడిగా ఉన్న సుప్రీమ్ ను సెలక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం రాజమౌళికి నచ్చలేదట. ఎన్ని ప్యాచ్ వర్క్‌లు చేసిన తాను అనుకున్నంతగా రాలేదట. అయినప్పటికీ అలానే రిలీజ్ చేశాడు. ఈ మూవీ ఇక ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…