MS Narayana : తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు ఎంఎస్ నారాయణ. రచయితగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తాగుబోతు పాత్రలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. కెరియర్ బాగా సాగుతున్న సమయంలోనే ఎమ్మెస్ నారాయణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.2015 సంవత్సరంలో ఆయన కన్నుమూసారు. మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎమ్మెస్ నారాయణ 23 సంవత్సరాల లోపు దాదాపుగా 750 కు పైగా సినిమాలలోనటించి మెప్పించారు. ఎమ్మెస్ నారాయణ గారు చనిపోయే ముందు వరకు కూడా కామెడీ పరంగా మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు.
ఎంఎస్ నారాయణ ఒక్కో ఏడాదికి 30కు పైగా సినిమాలలో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఎమ్మెస్ నారాయణ చనిపోయే ఏడాదిలోపే దాదాపుగా 11 సినిమాలు విడుదలయ్యాయంటే ఆయన క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు… ముఖ్యంగా ఎమ్మెస్ నారాయణ ఎక్కువగా నటించిన పాత్రలలో తాగుబోతు క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఆయన బ్రతికి ఉన్న రోజులలో ఎన్నో ఇంటర్వ్యూలో ఇచ్చిన ఇది అంశం గురించి అడగగా ఆయన అందుకు సమాధానం చెబుతూ అప్పట్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నాగబాబు హీరోగా నటించిన రుక్మిణి చిత్రంలో నటించాను. అందులో నాగబాబుకు అసిస్టెంట్ గా తాగుబోతు లాగా కనిపిస్తాను.
అయితే అప్పటివరకు నేను తాగుబోతు పాత్రలు చేయలేదు. కాని ఆ సమయంలో నన్ను ప్రోత్సహిస్తూ ఆ పాత్రని అవలీలాగా చేయించేలా చేశారు నాగబాబు గారు.. ఆయన వల్లే నేను తాగుబోతు పాత్రలను అలవాటు చేసుకున్న.. ముఖ్యంగా తాగిన తర్వాత నేను మాట్లాడినప్పుడు మాట్లాడే వ్యాస ప్రేక్షకులను బాగా కడుపుబ్బ నవ్విస్తుంది.. అందుకోసమే డైరెక్టర్లు కూడా తనకు ఎక్కువగా అలాంటి పాత్రలే రాస్తూ ఉంటారని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు, ఆయన పోషించిన పాత్రలు అందరిని అలరిస్తూనే ఉంటాయి. ఆయన ఒక గొప్ప రచయిత మరియు డైరెక్టర్ కూడా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…