MS Dhoni : ఐపీఎల్ 2024 ఈ వారం ముగుస్తుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తి కాగా, నాలుగు టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. రేపటి నుంచి క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ఐపీఎల్ ఎడిషన్ మొత్తం బ్యాటర్ల హవా నడిచింది. కోహ్లీ, ధోని, దినేష్ కార్తీక్ లాంటి లెజెండ్స్ ఎప్పటిలాగే బ్యాటుతో సత్తా చాటారు. అయితే ఐపీఎల్ 2025 ఎడిషన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. దీంతో అన్ని ఫ్రాంఛైజీలు కొత్త స్క్వాడ్‌తో బరిలోకి దిగవచ్చు. ఇదే సమయంలో కొందరు సీనియర్స్‌కు అవకాశాలు దక్కకపోవచ్చు. వచ్చే ఐపీఎల్ ఎడిషన్ సమయానికి కొంతమంది లెజెండ్స్ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. వారిలో ధోని ఉంటాడని అందరు భావిస్తున్నారు. రీసెంట్‌గా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ ధోనికి చివరి మ్యాచ్ కావచ్చు అని అంటున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 నుండి నిష్క్రమించింది. ఇప్పుడు అభిమానుల మదిలో ఒకే ఒక్క ప్రశ్న ధోనీకి ఈ సీజన్ చివరిదా? లేదా వచ్చే ఐపీఎల్ లో ఆడతాడా?. దీనికి సంబంధించి సీఎస్‌కే మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ బిగ్ న్యూస్ చెప్పాడు. ధోనీ తన చివరి మ్యాచ్ ఆడాడని హేడెన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024లో ధోని అద్భుతంగా బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్సర్లు కొట్టి అభిమానులను అలరించాడు.తమ హీరోని చూసేందుకు ప్రతి మ్యాచ్ లో అభిమానులు సందడి మాములుగా ఉండేది కాదు. ధోని వస్తున్నాడంటే చాలు స్టేడియం హోరెత్తేది.
ధోని రిటైర్మెంట్‌పై సీఎస్కే సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇంక అతను తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. తన నిర్ణయం వెల్లడించడానికి మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. అయితే అతను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. ఇందుకు సంతోషించాలి. ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము స్వాగతిస్తాం అని ఆయన అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…