CM YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్ విమానాశ్రయంలో దిగింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు లండన్‌లోని లూటాన్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించలేదు.
దీంతో ఆ విమానం 47 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటికి కూడా ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడంతో నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. దీంతో ఆమ్‌స్టర్‌డ్యామ్ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 1:30 గంటల వరకు సీఎం జగన్ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ల్యాండింగ్‌కు అనుమతి రావడంతో తిరిగి లండన్‌కు బయల్దేరారు. చివరికి మధ్యాహ్నం 2.30 గంటలకు లూటాన్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ అయింది. జగన్ కుటుంబం లండన్‌కు వెళ్లేందుకు కొలంబో నుంచి గురువారం విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రప్పించారు.
లండన్, అక్కడి నుంచి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లి చివరికి ఈ నెల 31 వ తేదీన తిరిగి తాడేపల్లికి రానున్నారు. అయితే ఫోన్నంబర్, ఈ-మెయిల్ వివరాలు అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్టు.. ఇతర వైసీపీ నేతలు ఆయనకు సెండాఫ్ ఇచ్చారు. లండన్ పర్యటన ముగించుకుని ఈ నెల 31న జగన్ తిరిగి విజయవాడకు చేరుకుంటారు. అయితే జగన్ ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ సెక్షన్ లో చాలా సామాన్యుడిలా కనిపించారు. సెక్యూరిటీ వారు తనని చెక్ చేయకుండా పంపిస్తున్నా కూడా చెక్ చేయమని మరీ అడిగడం అందరిని ఆశ్చర్యపరచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…