సినిమా పరిశ్రమలో ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ పరంగా కొందరు తమ సినిమాలకి ఊరి పేర్లని కూడా పెట్టుకుంటారు. అయితే ఊరి పేర్లతో వచ్చిన సినిమాలు కొన్ని మంచి విజయం సాధించగా, మరి కొన్ని అపజయం మూటగట్టుకున్నాయి. అయితే తెలుగులో ఊరి పేర్లతో ఎన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో ఎన్ని విజయం సాధించాయి, ఎన్ని అపజయం పొందాయి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మణిరత్నం దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా బొంబాయి. ఈ సినిమాకి ఊరి పేరు పెట్టారు ఇక రజినీకాంత్ హీరోగా నటించిన అరుణాలచలం మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.
కమల్ హాసన్ నటించిన సినిమాకి తెనాలి అనే ఊరి పేరు పెట్టారు. అయితే తెలుగులో ఈ మూవీ అంతగా ఆడలేదు. సూపర్ స్టార్ కృష్ణ, వడ్డే నవీన్ నటించిన చిత్రం అయోధ్య. ఈ మూవీకి ఆశించిన విజయం పొందలేదు. అయోధ్య శ్రీ రాముడి జన్మస్థలం పేరు. ఎన్.శంకర్ డైరెక్షన్లో శ్రీహరి హీరోగా వచ్చిన చిత్రం భద్రాచలం. ఈ మూవీ హిట్ అందుకుంది. శ్రీహరి హీరోగా నటించిన చిత్రం శ్రీశైలం. ఇది యావరేజ్ గా నిలిచింది. అనంతపురం అనే ఊరి పేరుతో వచ్చిన తమిళ సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఈ మూవీ నిరాశ పరిచింది. హనుమాన్ జంక్షన్ .. ఈ పేరుతో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో అర్జున్, జగపతి బాబు, వేణు నటించారు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అన్నవరం సినిమా విజయం పొందలేదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బద్రీనాత్ అనే సినిమా పెద్దగా ఆడలేదు.
ఇక 2018 లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య హీరోగా వచ్చిన బెజవాడ సినిమా విజయం పొందలేదు. నాని హీరోగా వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా విజయం పొందలేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ద్వారక సినిమా ప్లాప్ అయ్యింది. కులుమనాలి అనే సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇందులో శశాంక్, విమల రామన్ నటించారు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. శ్రీహరి హీరోగా వచ్చిన సింహాచలం సినిమా యావేరేజ్ గా నిలిచింది. రేణిగుంట ఊరు పేరుతో వచ్చిన సినిమా విజయం పొందలేదు. జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన కాశీ కూడా నిరాశపరచింది. అజిత్ హీరోగా వచ్చిన డబ్బింగ్ సినిమాకి పుణ్యక్షేత్రమైన తిరుపతి పేరు పెట్టిన విజయం సాధించలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…