OTT : ఓటీటీ ప్రియులకి కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ దక్కడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి వారం కూడా వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఈ శుక్రవారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలుపుకొని 11 వరకు సందడి చేయబోతున్నాయి. అయితే వాటిలో ఏది ప్రేక్షకులని ఎక్కువగా అలరిస్తుందనేది కూడా చూద్దాం. ముందుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అబంగ్ అధిక్ (మాండరిన్ మూవీ)- జూన్ 14, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు సినిమా)- జూన్ 14, జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేషియన్ వెబ్ సిరీస్)- జూన్ 14, మహారాజ్ (హిందీ చిత్రం)- జూన్ 14న స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఆహా ఓటీటీ విషయానికి వస్తే.. డియర్ నాన్న (తెలుగు సినిమా)- జూన్ 14, కురంగు పెడల్ (తమిళ వెబ్ సిరీస్)- జూన్ 14, జీ5 ఓటీటీలో లవ్ కీ అరెంజ్ మ్యారేజ్ (హిందీ చిత్రం)- జూన్ 14, పరువు (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 14, యక్షిణి (తెలుగు వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జూన్ 14, క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- జూన్ 14, ఫాల్ గాయ్ (హాలీవుడ్ చిత్రం)- బుక్ షో షో ఓటీటీ- జూన్ 14న స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వీటిలో హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన యక్షిణి (డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ), మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పరువు (జీ5 ఓటీటీ) వెబ్ సిరీసులు ప్రేక్షకులని ఎక్కువగా అలరించే అవకాశం ఉంది.
ఇక విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా ఆకర్షించే అవకాశం ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితోపాటు ఫాదర్స్ డే సందర్భంగా చూసేందుక తండ్రీ కొడుకుల ఎమోషన్ చెప్పే డియర్ నాన్న (ఆహా ఓటీటీ), హిందీ మూవీ మహారాజ్ (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ) కూడా ప్రత్యేకం కానున్నాయి. ఇక ఇవే కాకుండా పారిజాత పర్వం సినిమా, ది బాయ్స్ సీజన్ 4, తెలుగు మూవీ గ్రౌండ్ స్పెషల్ కానుంది.. పారిజాత పర్వం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంటే, ది బాయ్స్ సీజన్ 4, గ్రౌండ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. మొత్తానికి ఈ శుక్రవారం మాత్రం సినీ ప్రియులకి పెద్ద పండగే అని చెప్పాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…