Mokshagna : సినీ పరిశ్రమలో వారసుల రచ్చ కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక బాలయ్య తనయుడు ఎంట్రీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు బాలయ్యను ఎలా అయితే సినీ పరిశ్రమకు తీసుకొచ్చారో.. ఇప్పుడు బాలయ్య కూడా తన దర్శకత్వంలో కొడుకుని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఆదిత్య 369 సీక్వెల్ గా రాబోయే ‘ఆదిత్య 999 మ్యాక్స్’ ప్రాజెక్టుతోనే మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఉండబోతుందని సమాచారం.
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలోనే బాలయ్య స్వయంగా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.. అంతక ముందు బాలయ్య ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారట. మోక్షజ్ఞకు బాలయ్య ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట. తన చిత్రాల సెట్స్ కి తీసుకెళ్లి… కెమెరాను ఎలా ఫేస్ చేయాలి, డైలాగ్ డెలివరీ వంటి విషయాల్లో శిక్షణ ఇస్తున్నాడని తెలుస్తుంది. ఇక నలుగురిలో బెరుకు లేకుండా ధైర్యంగా ఉండేలా కుమారుడిని తీర్చిదిద్దుతున్నాడట. వీరసింహారెడ్డి, అనిల్ రావిపూడి మూవీ సెట్స్ లో మోక్షజ్ఞ కనిపించడానికి కారణం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తలే నిజమైతే 2023 బాలయ్య అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడంతో పాటు తన సినిమాని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ‘వీరసింహారెడ్డి’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వీర సింహారెడ్డి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో బాలయ్య జాయిన్ అయినట్టు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…