Mohanlal Alone Movie : మలయాళ స్టార్ మోహన్ లాల్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి మెప్పించారు దృశ్యం 2 వంటి థ్రిల్లర్ తో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఆరట్టు, బ్రో డాడీ, మాన్‌స్టర్ వంటి చిత్రాలు చేశారు మోహన్ లాల్. ఇక రీసెంట్‌గా ఎలోన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. షాజీ కైలాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 26న మలయాళ వెర్షన్ లో థియేటర్లలో విడుదల కాగా, ఇప్పుడు ఈ చిత్రాన్నితెలుగు, తమిళం, హిందీలో అనువదించి ఓటీటీలోకి తీసుకొచ్చారు. మార్చి 3 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
ఎలోన్ సినిమా కథ విషయానికి వస్తే.. కరోనా సమయంలో లాక్ డౌన్ విధించడంతో కాళీదాసు (మోహన్ లాల్) కోయంబత్తూర్ నుంచి కొచ్చికి షిఫ్ట్ అవుతాడు. ఒక కమ్యునిటీ అపార్టుమెంట్ లో అద్దెకు దిగగా, ఆయనకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒక తల్లీకూతుళ్ల గొంతులు రెగ్యూలర్ గా వినిపిస్తుండడంతో వారి గురించి వాకబు చేస్తాడు. ఇద్దరు ఆడవాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పి కేసు క్లోజ్ చేశారన్న విషయం తెలుసుకున్న కాళీ దాసు తిరిగి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. అప్పుడు కాళీదాసుకి ఎదురైన సంఘటనలు ఏంటనేది చిత్ర కథ.
ఎలోన్ సినిమాలో మనకు కాళీదాసు అనే ఒక్క పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మిగతా పాత్రలు కేవలం వాళ్ల ఫోన్ కాల్స్ లలో గొంతులు మాత్రమే వినిపిస్తాయి.సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. చిత్రం ముందుగా ఒక హారర్ సినిమా అని అనిపిస్తుంది. రాను రాను ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీగా మారుతున్నట్లు అనిపించి మూవీ ఎండింగ్‌కి వచ్చే సరికి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ముగుస్తుంది. డైరెక్టర్ షాజీ కైలాస్, హీరో మోహన్ లాల్ ఇద్దరు మంచి ప్రయత్నే చేసిన ఇందులో కొంత ఎంగేజింగ్ సీన్లు, స్క్రిప్ట్ వర్క్ ఉంటే బాగుండేది. మోహన్ లాల్ ఎప్పటిలానే తన నటనతో అదరగొట్టేశాడు. కాకపోతే ఒక్క పాత్ర అయ్యే సరికి జానాలకు బోర్ కొడుతుంది. కెమెరా పనితనం మాత్రం బాగుంది. మొత్తంగా ఈ సినిమాని ఒక్క ఫోన్ కాల్ లో తేల్చాల్సి ఉండగా, సాగదీసి రెండు గంటలు చేశారనిపించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…