Mohammad Siraj : ఒక్క మ్యాచ్‌తో సిరాజ్ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు.ఆసియా కప్ ఫైనల్‌లో అద్భుతంగా బౌల్ చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కారణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు సిరాజ్. అయితే తనకు లభించిన క్యాష్ ప్రైజ్‌ను కొలంబో గ్రౌండ్స్‌మన్‌కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్(6/21) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సిరాజ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గా వచ్చిన క్యాష్ ప్రైజ్ 50 వేల యూఎస్ డాలర్లను గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. మైదాన సిబ్బంది కష్టం వల్లే ఈ టోర్నీ సాధ్యమైందని వారిని కొనియాడాడు..మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే సమయంలో సిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ ప్రదర్శన ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇష్టమైన బిర్యానీ తిందామంటే ఇక్కడ లేదు. చాలా రోజులుగా నేను మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాను. గతంలో ఈ రోజు వచ్చిన ఎడ్జెస్ రాలేదు. పిచ్ ఆరంభంలో పేస్‌తో పాటు స్వింగ్‌కు అనుకూలించింది. స్వింగ్ అవుతుండటంతో ఫుల్లర్ లెంగ్త్ బాల్స్ వేయాలనుకున్నా.
మా ఫాస్ట్ బౌలర్ల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బౌండరీ ఆపాలని పరుగెత్తా. అది ఆపి ఉంటే మరింత సంతోషపడేవాడిని. ఇది నా బెస్ట్ స్పెల్. ఈ క్యాష్ ప్రైజ్‌ను గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చేస్తున్నా. వారు వల్లే ఈ టోర్నీ సాధ్యమైంది.’అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(6/21) సంచలన బౌలింగ్‌తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(3/3), జస్‌ప్రీత్ బుమ్రా(1/23) సత్తా చాటారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. స్వల్ప లక్ష్యం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు బదులు.. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్) ఓపెనింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27 నాటౌట్)తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…