KA Paul : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు చాలా మారిపోతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన వెంటనే ఆయనపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి అమ్ముడుపోయారని, ఇప్పుడేమే అచ్చం అలాగే పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారని కేఏ పాల్ స్పష్టం చేశారు. పార్టీలను అమ్ముకోవడానికే మాత్రమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు రూ.1,500 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఆ డబ్బుంతా హాంకాంగ్, దుబాయ్ నుంచి పవన్ కల్యాణ్ అకౌంట్లో పడిందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అందుకే ఆయన 25 సీట్లకు పరిమితమైపోయారని చెప్పారు.
పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే కాపులు నష్టపోతారని కేఏ పాల్ అన్నారు.చంద్రబాబు దోచుకున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ జగన్ దోచుకున్నాడు అని చంద్రబాబు చెప్తున్నారని, మీ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? అంటూ కే ఏ పాల్ ప్రశ్నించారు. దోచుకున్న వాళ్లంతా దేశ నాయకులంట.. చాలా దారుణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. బాయ్ బాయ్ మోడీ.. బాయ్ బాయ్ బాబు.. బాయ్ బాయ్ జగన్ అంటూ కే ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, అదానీల తొత్తులా మీరు అంటూ కేఏ పాల్ ఏపీ రాజకీయ నేతలను ప్రశ్నించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడిన ఆయన చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే అరెస్టు అయ్యారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వలన పవన్‌కి వచ్చే ఓట్లు కూడా రావు. చిరంజీవికి ఎలా బుద్ది చెప్పారో పవన్ కళ్యాణ్‌కి అలానే చెబుతారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత తెలివైన వాడు. ఒకసారి టీడీపీకి ఓటు వేయమని చెప్పి బుద్ది తెచ్చుకున్నాడు. అందుకే తెలివిగా వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాన్ మాదిరిగా ప్యాకేజ్ స్టార్ అని అనిపించుకోవడం లేదు. చిరంజీవి పవన్ మాదిరిగా సినిమా స్టార్స్ రాజకీయాలలోకి వచ్చి పరువు తీసుకోవద్దు అంటూ కేఏ పాల్ పంచ్‌లు విసిరారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…