Minister Seethakka : శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటికి దిక్కు లేదు. కరెంట్ అనేది అడ్రస్సే లేదు. నల్లగొండలో ఫ్లోరోసిస్‌తో లక్షన్నర మంది నడుములు వంగిపోతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాతబస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్‌నగర్‌లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసలు పోయే వారని కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి రోజు రెండు బస్సులు ముంబైకి పోయేవి. నారాయణపేట, మక్తలో కూడా ఇదే పరిస్థితి. వలసలు చూసి కన్నీళ్లు కార్చేవారు.
మహబూబ్‌నగర్‌లో 50 ఎకరాలు ఉన్న రైతు గుంపు మేస్త్రీగా పని చేసుకునే దుస్థితి. కూలీ చేసుకునే దుస్థితి అని కేటీఆర్ గుర్తు చేశారు.పదేండ్లు విధ్వంసం జరిగిందన్నారు. మరి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జీవన విధ్వంసం చెప్పాలి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించారు. గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఏపీ చరిత్ర మాట్లాడొద్దు అంటారు. వాస్తవాలు చెప్పాలి కదా..? సాగునీరు, తాగునీరు, కరెంట్ ఇవ్వలేని అసమర్థత గురించి చెప్తే ఉలికిపాటు ఎందుకు..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖ 85 వేల కోట్ల అప్పులో ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్.. 2014కు ముందు ట్రాన్స్‌కో, జెన్‌కోకు అప్పులు ఉన్నాయని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్కంల ఆస్తులు రెట్టింపు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. విద్యుత్ ఆస్తుల విలువు రూ. 1.37 లక్షల కోట్లు కాగా.. విద్యుత్ శాఖలో అప్పులకన్నా.. ఆస్తులే ఎక్కువ ఉన్నాయని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అమరుల త్యాగాలు, బలిదానాలు ఎన్నో మాటలు చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కింది ఎవరు, బలి దేవత ఎవరు, బలి దేవత అన్నది ఎవరు కూడా రికార్డ్స్ లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్‌కౌంటర్స్‌తో ఎంత మందిని చంపింది, ఎమర్జెన్సీ ఎవరు పెట్టారు, పౌర హక్కులు హననం చేసింది ఎవరు? పౌర హక్కుల గురించి మా సీతక్కకి తెలుసు. చర్చల పేరుతో నక్సలైట్స్‌ని పిలిచి చంపింది ఎవరు అంటూ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…