CM Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, గవర్నర్ ప్రసంగంపై వాడీవేడి చర్చ కొనసాగుతోంది. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన రిప్లై కోసం కేటీఆర్ తహతహ లాడుతున్నందుకు మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం స్ఫూర్తి అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ కు అవకాశం కల్పించిందే కాంగ్రెస్ అని తెలిపారు. కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పేర్కొన్నారు. అవకాశం ఇస్తే కేసీఆర్ సింగిల్ విండో చైర్మన్ గా ఓడిపోయారని తెలిపారు. . సభలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు ప్రజాస్వామ్య స్పూర్తి ముఖ్యం అన్నారు. కేటీఆర్ కు ప్రజాస్పూర్తిపై అవగాహన లేదన్నారు.
49 శాతానికి, 51 శాతానికి తేడా ఉంటుందని గెలిచిన సీట్ల గురించి చెప్పుకొచ్చారు. 51 శాతం వచ్చిన వారికి వంద శాతం ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా విలువ ఉంటుందన్నారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేశారు. గతంలో పాలన గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చి రాజకీయ జీవితం ప్రసాదించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గత పాలనలో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది కూడా కాంగ్రెస్సే అని చెప్పారు. కేకే, మహేందర్ రెడ్డి సీటు గుంజుకొని కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారన్నారు.
రేవంత్ రెడ్డి కామెంట్స్ కి కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఎన్నారై అంటూ రేవంత్ మాటలకు ధీటైన సమాధానం ఇచ్చారు. తెలంగాణ బలిదేవత ఎవరో అందరికీ తెలుసని.. బలిదానం, నియంతృత్వం గురించి కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. అలాగే ఎన్నారై అన్న పదంపై కేటీఆర్ స్పందిస్తూ.. నాన్ రిలయబుల్ ఇండియన్ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో పావు వంతు కూడా అమలు కాలేదు. మార్చి 17 కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుందన్నారు. 100 రోజుల్లో చెప్పిన హామీలు అమలు చేయకుంటే అప్పుడు కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తుచేశారు. బానిసలు పోతే.. బానిసకు ఓ బానిస అన్నట్లు ఉంది కాంగ్రెస్ పరిస్థితి అన్నారు. ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి భాష మారడం లేదని విమర్శించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…