Minister Roja : ప‌వ‌న్‌, చంద్ర‌బాబుకు మంత్రి రోజా కౌంట‌ర్‌.. జ‌బ‌ర్ద‌స్త్ ను మించిన కామెడీ అంటూ సెటైర్స్‌..!

Minister Roja : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. రోజు రోజుకీ అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెబుతోంది. మ‌రోవైపు టీడీపీ, జ‌న‌సేన సైతం అధికారం త‌మ‌దే అని ధీమాతో ఉన్నాయి. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఏపీలో కూడా జ‌గ‌న్ అదేవిధంగా అధికారాన్ని కోల్పోతార‌ని, ఏపీలో టీడీపీ, జ‌న‌సేన ఉమ్మ‌డిగా అధికారంలోకి వ‌స్తాయ‌ని ఆ పార్టీల నేతలు జోస్యం చెబుతున్నారు.

ఇక గ‌త కొద్ది రోజులుగా మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సీట్ల పంప‌కాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నిన్న మొన్న‌టి వ‌ర‌కు జైల్లో ఉండ‌డం వ‌ల్ల ఈ ప్ర‌క్రియ ఆల‌స్యం అయింది. కానీ ఆయ‌న‌కు బెయిల్ ల‌భించ‌డంతో ఎట్ట‌కేల‌కు ఇరు పార్టీల నేత‌లు సీట్ల పంప‌కాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. జ‌న‌సేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, ఏయే స్థానాల్లో వారు పోటీ చేస్తారు అన్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు బాబు, ప‌వ‌న్ స‌మావేశ‌మై సీట్ల పంపకంపై చ‌ర్చించారు. అయితే దీనిపై మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Minister Roja funny satires and comments on pawan kalyan and chandra babu
Minister Roja

జ‌న‌సేన‌, టీడీపీ అధికారంలోకి వ‌స్తాయ‌ని క‌ల‌లు కంటున్నాయ‌ని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వారికి సీట్ల పంప‌కాల్లో ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని, అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి మ్యానిఫెస్టోను ఎందుకు ప్ర‌క‌టించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో అస‌లు ఏయే స్థానాల్లో పోటీ చేయాలో వారు ఇంకా నిర్ణ‌యించుకోలేక‌పోతున్నార‌ని అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల కోసం హ‌డావిడి ప‌డుతున్నాయి త‌ప్ప ప్ర‌జ‌ల‌పై ప్రేమ‌లేద‌ని, వారు అధికారంలోకి రావ‌డం అంతా భ్ర‌మేన‌ని అన్నారు. అలాగే ఆరోగ్య శ్రీ ప‌థ‌కంపై కూడా వారు అన్నీ నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మంత్రి రోజా విమ‌ర్శించారు.

కాగా న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు ఈసారి సీఎం జ‌గ‌న్ టిక్కెట్ ఇవ్వ‌డం లేద‌ని, అక్కడ ఆమెపై వ్య‌తిరేక‌త ఉంద‌ని, క‌నుక‌నే రోజా టిక్కెట్‌ను కోల్పోయార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ, జ‌న‌సేన ప్ర‌చారం చేశాయి. కానీ మంత్రి రోజా ఆ విమ‌ర్శ‌ల‌ను కొట్టి పారేశారు. ఇంకా ఈ విష‌యంపై ఎటూ తేల‌లేద‌ని, త‌న‌కే ఆ విష‌యం తెలియ‌ద‌ని, టీడీపీ, జ‌న‌సేన‌కు ఎలా తెలుస‌ని ప్ర‌శ్నించారు. వారు చెబుతున్న‌వ‌న్నీ అస‌త్యాలేన‌న్నారు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago