Minister Nara Lokesh : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో ప్రజలు వైసీపీ నేతలపై చెబుతున్న కంప్లైంట్లను ఓ బుక్‌లో రాసుకున్నారు. అది ఎరుపు రంగులో ఉండదు కానీ.. దాన్ని రెడ్ బుక్ అని పిలిచారు. తాము అధికారంలోకి రాగానే.. రెడ్ బుక్‌లో రాసిన ప్రతీ అంశంపై చర్యలు తీసుకుంటానని ఇదివరకు చాలాసార్లు ఆయన చెప్పారు. ఐతే.. అప్పట్లో వైసీపీ నేతలు.. లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం నారా లోకేష్ రెడ్ బుక్‌ని సీరియస్ తీసుకుంటున్నారు. రెడ్ బుక్‌లో ప్రధానంగా రెవెన్యూ, ఖర్చులు, అభివృద్ధి, ద్రవ్యోల్బణం వంటి అంశాలుంటాయి. తన బుక్‌లో వైసీపీ ప్రభుత్వ అవినీతి ఆరోపణలను రాసుకున్నారు.
వైసీపీ కొంత కాలంగా రెడ్ బుక్ గురించి చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో భూములు దోచేసిన వారిని వదిలి పెట్టాలా అని ప్రవ్నించారు. రెడ్ బుక్ లో తప్పులు చేసిన వారి పేర్లు ఉన్నాయని..వారికి శిక్ష పడేలా చేయటం ఖాయమని స్పష్టం చేసారు. అన్నాక్యాంటీన్లకు డబ్బులు లేవని చెప్పిన వైసీపీ..సర్వే రాళ్ల కోసం భారీ గా ఖర్చు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. “రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి. రెడ్ బుక్ గురించి ఇవాళ నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా ప్రతి ప్రసంగం గమనించండి… ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్లని నేను వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పాను. మరోసారి చెబుతున్నాను… చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టను అని చెప్పాను.
జోగి రమేశ్ గారి అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూముల పత్రాలు తీసుకుని, నకిలీ పత్రాలు సృష్టించి, అతడి పేరు మీద బదిలీ చేసుకుని, ఆ భూములను అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. వారికి రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదు. అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? రేపు మద్యం వ్యవహారంలోనూ చర్యలు తీసుకుంటాం, ఇసుక దందాల్లోనూ చర్యలు తీసుకుంటాం. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తే మేం పట్టించుకోకూడదా? ఆ రోజు నేను ఊరూరా రెడ్ బుక్ గురించి మాట్లాడాను, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వారిని నేను వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు అని ప్రజలకు హామీ ఇచ్చాను. రెడ్ బుక్ వల్లే మేం గెలిచామని చెప్పడంలేదు… అందరి కృషి వల్ల గెలిచాం… అందులో రెడ్ బుక్ కూడా ఒక భాగం అని లోకేష్ పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…