Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Minister Nara Lokesh : రెడ్ బుక్‌లో ఉన్న ఏ ఒక్క‌రినీ విడిచిపెట్టేది లేదు.. మంత్రి నారా లోకేష్ క్లారిటీ..!

Shreyan Ch by Shreyan Ch
August 18, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Minister Nara Lokesh : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. యువగళం పాదయాత్ర స‌మ‌యంలో ప్రజలు వైసీపీ నేతలపై చెబుతున్న కంప్లైంట్లను ఓ బుక్‌లో రాసుకున్నారు. అది ఎరుపు రంగులో ఉండదు కానీ.. దాన్ని రెడ్ బుక్ అని పిలిచారు. తాము అధికారంలోకి రాగానే.. రెడ్ బుక్‌లో రాసిన ప్రతీ అంశంపై చర్యలు తీసుకుంటానని ఇదివరకు చాలాసార్లు ఆయన చెప్పారు. ఐతే.. అప్పట్లో వైసీపీ నేతలు.. లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం నారా లోకేష్ రెడ్ బుక్‌ని సీరియ‌స్ తీసుకుంటున్నారు. రెడ్ బుక్‌లో ప్రధానంగా రెవెన్యూ, ఖర్చులు, అభివృద్ధి, ద్రవ్యోల్బణం వంటి అంశాలుంటాయి. తన బుక్‌లో వైసీపీ ప్రభుత్వ అవినీతి ఆరోపణలను రాసుకున్నారు.

వైసీపీ కొంత కాలంగా రెడ్ బుక్ గురించి చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో భూములు దోచేసిన వారిని వదిలి పెట్టాలా అని ప్రవ్నించారు. రెడ్ బుక్ లో తప్పులు చేసిన వారి పేర్లు ఉన్నాయని..వారికి శిక్ష పడేలా చేయటం ఖాయమని స్పష్టం చేసారు. అన్నాక్యాంటీన్లకు డబ్బులు లేవని చెప్పిన వైసీపీ..సర్వే రాళ్ల కోసం భారీ గా ఖర్చు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. “రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి. రెడ్ బుక్ గురించి ఇవాళ నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా ప్రతి ప్రసంగం గమనించండి… ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్లని నేను వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పాను. మరోసారి చెబుతున్నాను… చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టను అని చెప్పాను.

Minister Nara Lokesh given clarity once again on redbook
Minister Nara Lokesh

జోగి రమేశ్ గారి అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూముల పత్రాలు తీసుకుని, నకిలీ పత్రాలు సృష్టించి, అతడి పేరు మీద బదిలీ చేసుకుని, ఆ భూములను అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. వారికి రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదు.  అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? రేపు మద్యం వ్యవహారంలోనూ చర్యలు తీసుకుంటాం, ఇసుక దందాల్లోనూ చర్యలు తీసుకుంటాం. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తే మేం పట్టించుకోకూడదా? ఆ రోజు నేను ఊరూరా రెడ్ బుక్ గురించి మాట్లాడాను, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వారిని నేను వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు అని ప్రజలకు హామీ ఇచ్చాను. రెడ్ బుక్ వల్లే మేం గెలిచామని చెప్పడంలేదు… అందరి కృషి వల్ల గెలిచాం… అందులో రెడ్ బుక్ కూడా ఒక భాగం అని లోకేష్ పేర్కొన్నారు.

Tags: Minister Nara Lokesh
Previous Post

Pat Cummins : ఇండియాను ఓడించి తీరుతాం.. ప్యాట్ క‌మిన్స్‌..

Next Post

YS Jagan : వైసీపీలో అస‌లు ఏం జ‌రుగుతుంది..? సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్‌..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.