Matrudevobhava Movie : మాతృదేవోభవ. ఈ సినిమా క్లాసిక్ మూవీగా నిలిచి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న విషయం తెలిసిందే. అమ్మ గొప్పతనం గురించి చెప్పే సినిమాలు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే వచ్చాయి.. అందులో ఒకటి మాతృదేవోభవ. ఇందులో విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యానార్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన నలుగురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా…అమ్మ ప్రేమకి అసలైన అర్ధం చెప్పిన ఈ సినిమా 1993 లో విడుదలై మంచి విజయం సాధించింది.
నాజర్, మాధవి ల నటన సినిమాకి ప్రాణం పోయగా, మిగతా వారు కూడా వారి వారి పాత్రలలో నటించి మెప్పించారు. అయితే మొదటగా ఈ సినిమా కథను జీవితా రాజశేఖర్ లకు వినిపించారు. కానీ ఈ సినిమా లో నటించేందుకు జీవిత నిరాకరించింది. తన భార్య రిజెక్ట్ చేసిన కారణంగా రాజశేఖర్ కూడా సినిమాని చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో తండ్రి పాత్రలో నాజర్‌ని తీసుకోగా, మరో పాత్రలో మాధవిని సెలక్ట్ చేశారు. ఇక సంగీతం కోసం కీరవాణిని సంప్రదించారు. కథ విని వెంటనే తాను ఓకే చెప్పారు. 1993 అక్టోబర్ 22 వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు.
ఈ సినిమా విడుదలైన తొలి రోజులలో పెద్దగా ప్రేక్షకాదరణ లేదు. మెల్లమెల్లగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు వారాల తరవాత థియేటర్ కు వచ్చిన ప్రతిఒక్కరికీ ఖర్చీఫ్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ తరవాత ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రమంలోనే ఆరు కేంద్రాల్లో సినిమా వందరోజులు ఆడింది. విధివశాత్తూ భర్తను కోల్పోయిన శారద తన లాగా తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది. చివరికి తాను చనిపోతుంది. దత్తత ఆయితే ఇచ్చింది కానీ ఆ తరవాత తన పిల్లల కోసం పడే తాపత్రయం కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…