Rama Krishna: చిన్న వ‌య‌స్సులో మ‌ర‌ణించిన ఎన్టీఆర్ కుమారుడు.. ఆయ‌న గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

Rama Krishna: విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.ఆయ‌న 20వ ఏట త‌న మేన‌మామ కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకంని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. 1942 మే 2న ఎన్టీఆర్, బసవతారకం దంప‌తుల‌కి వివాహం జ‌ర‌గ‌గా, వారికి మొత్తం ఎనిమిది మంది మగ సంతానం , నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ఎన్టీఆర్ తన కుమారులకు రామకృష్ణ, జై కృష్ణ, సాయి కృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, జయశంకర్ కృష్ణ అని అందరి పేరు చివరన కృష్ణ వచ్చే విధంగా నామకరణం చేశారు.

ఈ విష‌యాలు తెలుసా?

అలాగే కుమార్తెలు అంద‌రికి చివ‌రిన ఈశ్వ‌రి వ‌చ్చేలా.. పురందేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి అని నామకరణం చేశారు. నందమూరి తారక రామారావు గారి మొదటి కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నప్పుడే చనిపోయాడు.రెండవ కొడుకు జయకృష్ణ. మూడవ సంతానం అమ్మాయి ఆమే పురందరేశ్వరి. ఆ తర్వాత కొడుకు సంతానం నందమూరి సాయి కృష్ణ.ఆయన కూడా చనిపోయారు. నాలుగవ కుమారుడు నందమూరి హరికృష్ణ.ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే.

ఏడవ కుమారుడు పేరు నందమూరి రామకృష్ణ జూనియర్. మొదటి కుమారుడి పేరు ఈయనకు పెట్టారన్నమాట.అందుకే ఈయన పేరు చివర జూనియర్ అని పెట్టారు. అయితే మొద‌టి సంతానం రామకృష్ణ అంటే ఎన్టీఆర్ కు ఎంతో ప్రేమ అభిమానం ఉండేవి, చెన్నైలోని ఎన్టీఆర్ నివాసంలో రామకృష్ణ అతిథులను ఎంతో గౌరవంగా చూసుకునే వారట. వచ్చిన ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చేవారట. తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే రామకృష్ణకు అపారమైన భక్తి ఉండేది. దాంతో చిన్న వయసులోనే దాదాపు దేశం లోని పుణ్యక్షేత్రాలు అన్ని రామకృష్ణ చూసి వచ్చారు. 17 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు. నాన్న‌మ్మ‌, తాత‌య్య‌ల‌తో క‌లిసి నిమ్మ‌కూరు వెళ్లిన స‌మ‌యంలో మ‌సూచి వ్యాధిన ప‌డి క‌న్నుమూసారు. రామ‌కృష్ణ చ‌నిపోయిన స‌మ‌యంలో ఎన్టీఆర్ షూటింగ్‌లో ఉన్నాడ‌ట‌. విష‌యం తెలిసి బోరున ఏడ్చిన ఎన్టీఆర్ వెంట‌నే నిమ్మ‌కూరు వెళ్లి అక్క‌డ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago