Masood Fame Bandhavi Sridhar : మసూద.. ఇటీవల విడుదలై మంచి హిట్ కొట్టింది ఈ చిత్రం. సాయి కిరణ్ రైటింగ్ అండ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో సంగీత, తిరువీర్, శుభలేఖ సుధాకర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదితరులు కీ రోల్స్ పోషించారు. హర్రర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తెరకెక్కిన ఈసినిమా రీసెంట్‌గా ఆహా ఓటీటీలో రిలీజై రికార్డు లెవల్ వ్యూస్‌ను కూడా దక్కించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా నవంబర్ 18న థియేటర్లో రిలీజ్ అయిన మసూద.. అందరికీ దిమ్మ తిరిగే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ను అందించడమే కాకుండా సస్పెన్స్‌తో కూడిన హర్రర్ ఎలిమెంట్స్‌తో.. వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు హర్రర్ సినిమాగా హిస్టరీ కెక్కింది.
అరబిక్ లెటర్స్ స్టయిల్లో తెలుగు టైటిల్ ను డిజైన్ చేయడంతోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా విషయంలో డైరెక్టర్స్ రెండు విషయాల్లో మరింత శ్రద్ధ తీసుకున్నాడు. సాధారణంగా ఏ సినిమాలోనైనా టైటిల్ రోల్ ను పోషించినవారిని చూపించకుండా ఉండరు. కానీ ‘మసూద’ పాత్రను పోషించిన యువతి ముఖం సినిమా మొత్తంలో ఎక్కడా కనిపించదు. మొదటి నుంచి చివరి వరకూ ఆ పాత్ర బురఖాలోనే కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సినిమాలో ‘మసూద’ ఆత్మ ఆవహించిన యువతిగా నటించింది మరెవరో కాదు బాంధవి శ్రీధర్. ఆమెకి తెలుగులో ఇదే మొదటి సినిమా.
ఈ అమ్మాయి ఎవరికీ తెలియకపోవడం వలన ఎవరికీ ఎలాంటి అంచనాలు ఉండవు. కానీ ఆమె యాక్టింగ్ చూసిన తరువాత మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాంధవి శ్రీధర్ పక్కా తెలుగమ్మాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఈమె.. మోడలింగ్ ద్వారా సినిమాల్లో అవకాశలు దక్కించుకుంది 2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన బాంధవి.. అదే ఏడాది మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో కూడా విజేతగా నిలిచింది. నటిగా ఇదే ఆమెకు తొలి మూవీ అయిన చాలా అద్భుతంగా నటించి మెప్పించింది. రానున్న రోజులలో మరిన్ని ఆఫర్స్ ఆమె అందుకోవడం ఖాయం. భాందవి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఆమె ఫాదర్ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారట .ఆయన సపోర్ట్‌తోనే సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పింది.