Chalapathi Rao : సీనియర్ నటుడు సత్యనారాయణ మరణ వార్త మరచిపోకముందే చలపతి రావు కన్నుమూపసారు. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ కన్నుమూయగా..తాజాగా మరో సీనియర్ నటుడు చలపతి రావు హఠాన్మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం (డిసెంబర్ 25న) తెల్లవారుజామున గుండెపోటుతో తన కుమారుడు రవిబాబు నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. చలపతి రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఎక్కువగా నెగిటివ్ క్యారక్టర్లతో పరిచయం అయిన చలపతి రావు అన్ని రకాల పాత్రల్లోనూ నటించి వైవిధ్యం చాటారు.
తండ్రి, బాబాయి, మామయ్య, విలన్, సైడ్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ నటించిన చలపతి రావు కృష్ణా జిల్లా పామర్రు దగ్గర బల్లిపర్రుకు చెందిన చలపతిరావు1966లో సినిమాల్లోకి వచ్చారు. ‘గూఢచారి 116’ ఆయన మొదటి సినిమా. 2021లో నాగార్జునతో కలసి నటించిన బంగార్రాజు ఆయన చివరి సినిమా. సాక్షి, సంపూర్ణ రామాయణం, యమగోల, దానవీరశూర కర్ణ, వేటగాడు, కొండవీటి సింహం, ఖైదీ, బొబ్బిలి బ్రహ్మన్న, అల్లుడా మజాకా, సిసింద్రీ, ఆపరేషన్ ధుర్యోధన, కిక్, బెండ్ అప్పారావు ఆర్ఎంపీ, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ వంటి సినిమాలెన్నిటిలోనో నటించారు.
![Chalapathi Rao : ఇన్నేళ్ల కాలంలో నటుడు చలపతి రావు ఎంత ఆస్తి సంపాదించారో తెలుసా..? Chalapathi Rao net worth how many properties and assets value](http://3.0.182.119/wp-content/uploads/2022/12/chalapathi-rao.jpg)
1996లో తెలుగు తెరకు పరిచయమైన 600కు పైగా సినిమాలలో నటించారు ఈయనకు కుమారుడు రవిబాబు కూడా టాలీవుడ్ లో నటుడుగా, దర్శకుడుగా తనదైన ముద్ర వేసుకున్నారు. సీనియర్ నటుడుగా ఉన్న చలపతి రావు ఇన్నేళ్లలో సంపాదించింది కేవలం రూ.20 కోట్ల రూపాయలు అన్నట్లుగా సమాచారం. అది ఆయన పేరు మీద ఉన్న రెండిళ్లకు సంబంధించి విలువ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతకుమించి ఈయన ఇతర ప్రాపర్టీలు ఏవి లేకుండా ఉండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చలపతి రావు సంపాదించి అంతా ఏమి చేశాడంటూ కొందరు వాపోతున్నారు. చలపతి రావు నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశారు.