Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఖాతాలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. రామాయణం ఆధారంగా ఆది పురుష్ హై బడ్జెట్ తో వస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా మరియు కృతి సనన్ సీతగా కనిపిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఇక కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తుండగా, సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టే హోమబుల్ ఫిలింస్ సినిమా బడ్జెట్ని కూడా హై రేంజ్ లో అనుకుంటున్నారు. ఇక ఈ రెండు కాకుండా తెలుగు పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతీతో రాజా డీలక్స్ షూటింగ్ యమ జోరుగా జరుపుకుంటున్నారు రెబల్ స్టార్.
ఈ మూడు సినిమాల్లో కాకుండా మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాని కూడా 500 కోట్లు పైనే ప్లాన్ చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ టు టాలీవుడ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. తాజాగా 21కోట్ల బ్యాంక్ లోన్ తీసుకున్నాడన్న వార్త ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన ఓ బ్యాంక్ నుంచి రూ. 21 కోట్ల రుణం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, అందరు ఆశ్చర్యపోతున్నారు.
హైదరాబాద్ లో ఉన్న తన ప్రాపర్టీపై ప్రభాస్ బ్యాంక్‌లో రూ. 21 కోట్ల రుణం తీసుకున్నాడని, దానికి సంబంధించిన చెక్ కూడా తాజాగా ఆయన చేతికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకునే ప్రభాస్‌కి అసలు బ్యాంక్ లో రుణం తీసుకునేంత అవసరం ఏమొచ్చింది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంత చిన్న అమౌంట్ కోసం తన ప్రాపర్టీని ప్రభాస్ ఎందుకు బ్యాంకులో పెట్టారు..? అంటూ నెటిజన్లు జుట్టు పీక్కుకుంటున్నారు. అయితే ప్రభాస్ లోన్ తీసుకోవడం వెనక ఓ కారణంగా బలంగా వినిపిస్తోంది. డబ్బులు అవసరమై ప్రభాస్ లోన్ తీసుకోలేదని.. ప్రాపర్టీ కబ్జా కాకుండా ఉంటుందనే ఉద్ధేశంతోనే ఆయన లోన్ తీసుకున్నాడంటూ టాక్ నడుస్తోంది.