సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్ గా, విశ్వక్ సేన్ హీరోగా ఇటీవల ఓ సినిమాని లాంచ్ చేశారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇదిలావుండగా తాజాగా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో టాలీవుడ్ లో వివాదం చెలరేగింది. దర్శకనిర్మాత అర్జున్ మొన్నా ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ విషయంపై హీరో విశ్వక్ స్పందించాడు. ఓ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్.. వివాదంపై స్పందించాడు.
ఇటీవల జరిగిన అలజడికి 2, 3 రోజులు హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది. నేను కమిటెడ్ ప్రొఫెషనల్ యాక్టర్ ని, ప్రతి సినిమాని నాది అనుకొని చేస్తాను. నేను ఆ సినిమాకి నా వంతు ఎఫార్ట్ పెట్టి చేద్దాము అనుకున్నా. కానీ మా ఇద్దరి మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు. ఆ విషయం నేను లేటుగా రియలైజ్ అయ్యాను. వాళ్ల మేనేజర్ 2 రోజుల తర్వాత మాకు కాల్ చేసి రెమ్యునరేషన్ వెనక్కి పంపించమని చెప్పాడు. నా మాటకి విలువ లేదు, మనసుని చంపుకొని నేను నటించలేను.
అందుకే మాట్లాడుకుందాం అని చెప్పా కానీ ఈలోపే అర్జున్ సార్ ఇలా చేసాడు అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. అయితే ఫిలిం ఛాంబర్ లో అర్జున్ ఇచ్చిన కంప్లైంట్ గురించి ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ అర్జున్ లాంటి సీనియర్ ఆర్టిస్టుకి అవమానం జరిగింది అంటే కచ్చితంగా నేను విశ్వక్ సేన్ ని వివరణ కోరుతాను. దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సీనియర్స్ కి మర్యాద ఇవ్వాల్సిందే. యాటిట్యూడ్ వంటివి చూపిస్తే తోకలు కత్తిరిస్తా అని మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…