ఎవ‌రూ ఊహించ‌ని కాన్సెప్ట్‌తో వ‌స్తున్న క‌ల్యాణ్ రామ్ మూవీ.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టే..!

టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఇటీవల బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ మూవీ సక్సెస్ అనంతరం క‌ళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేందర్ రెడ్డితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మేక‌ర్స్ సోమ‌వారం రోజున అమిగోస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విభిన్నమైన పాత్ర‌లు, సినిమాలు చేసే హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న ఈ సినిమా టైటిల్ కూడా డిఫ‌రెంట్‌గా ఉండ‌టంతో అంద‌రిలో ఆసక్తిని పెంచారు.

అమిగోస్ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అమిగోస్ అనేది స్పానిష్ ప‌దం. ఈ టైటిల్ అనౌన్స్ చేయ‌టంతో పాటు స్టైలిష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సినిమా కాన్సెప్ట్ ఏంట‌నే విష‌యాన్ని సూచిస్తుంది. క‌ళ్యాణ్ రామ్ పాత్ర 3 షేడ్స్‌లో ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ పోస్ట‌ర్ ఎలివేట్ చేస్తుంది. నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు అనేది పోస్ట‌ర్‌పై క్యాప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక స్టోరీ లైన్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. హీరో తనలా పోలి ఉన్న మనుషులు ఎంతమంది ఉన్నారు? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు ఒక యాప్‌ని వినియోగిస్తాడట.

kalyan ram amigos movie poster out story line

అయితే అతనికి మరో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారిలో ఒక వ్యక్తికి 6 వేళ్లు ఉంటాయి. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మాత్రం నెగెటివ్‌ షేడ్స్ ఉన్న వ్యక్తట. అంటే అతని వల్ల మిగిలిన ఇద్దరికీ ఏదైనా ప్రమాదం జరగడం లేదా మిగిలిన వాళ్ల స్థానాలను అతను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఒకరకంగా మూవీ కాప్షన్ చూసుకున్నా కూడా కథలో జరిగేది అదే అని అర్థమవుతుంది. అయితే ఈ స్టోరీ లైన్ ఇప్పటిది కాదు. ట్విట్టర్‌లో డిసెంబర్ 31, 2021లోనే ఈ స్టోరీలైన్ లీకైంది. అప్పటి నుంచి ప్లాన్‌ చేసి ఇప్పుడు 2023, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నారనమాట. చూడాలి దీంతో కళ్యాణ్ రామ్ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో.

Share
Usha Rani

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago