Manchu Vishnu And Manoj : మంచు మనోజ్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర దుమారానికి తెరదీసిన విషయం తెలిసిందే. మనోజ్ షేర్ చేసిన వీడియోలో సారథి అనే తన మనిషిపై సోదరుడు దాడిచేస్తున్నారంటూ ఫేస్ బుక్ లో వీడియో షేర్ చేశారు. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ.. తామిద్దరి మధ్య ఎప్పుడూ ఉండే గొడవేనని, అది చాలా చిన్న సంఘటన అన్నారు. సారథితో తనకు గొడవవుతుంటే ఆపకుండా మనోజ్ వీడియో తీశాడని, ఇది అంతగా స్పందించాల్సిన విషయం కాదు అని విష్ణు చెప్పుకొచ్చారు.. ఇక మంచు లక్ష్మీ స్పందిస్తూ ఈ విషయం తనకు తెలియదన్నట్టుగా పేర్కొంది.
అయితే తాజాగా ఈ ఇష్యూపై మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులైన త్రిపురనేని నిర్మాత చిట్టి బాబు స్పందించారు. ఇందులో ద్దరిదీ తప్పు ఉందని పేర్కొన్నారు. గొడవ జరిగిన ఇల్లు సారథిది. ఎన్నో ఏళ్ల నుండి మోహన్ బాబు పర్సనల్ వ్యవహారాలు ఆయన చూస్తున్నాడు. మోహన్ బాబు బ్యాంక్ అకౌంట్స్, సినిమా షెడ్యూల్స్ చూసేవాడు. రీసెంట్‌గా జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌లో కూడా సారథి నిలబడి పనిచేశాడు. అయితే మొన్నటిదాకా అన్ని విషయాలపై మోహన్ బాబు పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలందరికీ ఎవరి ఆస్తులు వారికి పంచేశారు. తదనంతరం కూడా ఎవరెవరికి ఏం రావాలో సెట్ చేసారు.

ఎంబీ యూనివర్సిటీకి సంబంధించి లేదంటే మరేదైనా సమస్య వస్తే తప్ప మోహన్ బాబు జోక్యం చేసుకోవడం లేదు. అయితే మంచు విష్ణు కాలేజ్ విషయంలో సారథని కొన్ని ప్రశ్నలు అడగగా, అతను సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. చివరకు విష్ణుకు విసుగొచ్చి డైరెక్ట్‌గా అతను ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. అతను బంధువే కాబట్టి ఆయన ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో విష్ణు చేయి ఎత్తాల్సి వచ్చింది. ఇలాంటి సమస్య ఉన్నపుడు మోహన్ బాబుతో చెప్తే సరిపోయేదని, కానీ విష్ణు తనే సాల్వ్ చేద్దామని రావడం వల్లే ఇదంతా జరిగింది.ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియాలో కూడా పెట్టడం తప్పే అని చిట్టిబాబు అన్నాడు. అన్నయ్య హీరోయిజం చూపించాలని అలా సోషల్ మీడియాలో పెట్టాను కాని, వేరేలా అయిందని మనోజ్ వివరణ ఇచ్చాడని చిట్టిబాబు తెలియజేశారు.