మంచు మ‌నోజ్ భ‌లే బ‌కరా చేశాడుగా.. అంద‌రు ఫూల్ అయిన‌ట్టేనా..!

మంచు మనోజ్ గ‌త కొద్ది కాలంగా తెగ వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. మంచు మ‌నోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని తెగ వార్త‌లు వ‌స్తుండ‌గా, జనవరి 20న ఓ విషయం పంచుకుంటానని.. చెప్పాడు. ఇది చెప్పి ఫాలోవర్లను ఆసక్తికి గురిచేశాడు మనోజ్. దీంతో తమ హీరో పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వబోతున్నాడని అంతా అనుకున్నారు. అయితే అందరు అనుకున్నట్లు పెళ్లి గురించి కాదు.. తన కొత్త సినిమా గురించి అంటూ అసలు విషయం చెప్పేశాడు మనోజ్. సినిమాలు చేసి చాలా కాలం అవుతుందని.. ఇప్పటికీ అదే ప్రేమ చూపిస్తున్నారని.. ఆ ప్రేమకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందంటూ మనోజ్ చేసిన ట్వీట్ చూసి అభిమానులు నోరెళ్ల‌పెట్టారు.

ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వ్యక్తిగత జీవితం పరంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు మంచు మనోజ్. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్‌‌కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంచువారబ్బాయి రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలు షికారు చేశాయి.తన భార్య ప్రణతి రెడ్డితో ఎప్పుడైతే డివోర్స్ తీసుకున్నారో అప్పటినుంచి మంచు మనోజ్ వార్తలు నిత్యం ఏదో ఒక రూపంలోవార్త‌ల‌లో నిలుస్తూనే ఉన్నాడు.. ఇంతలో మంచు మనోజ్ రెండో పెళ్లి మ్యాటర్ తెరపైకి రావడం, ఇటీవల నగరంలోని ఓ వినాయక మండపంలో భూమా మౌనికతో కలిసి మంచు మనోజ్ కనిపించడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.

manchu manoj surprised everybody with his post

అయితే ఈ రోజు త‌న పెళ్లికి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఇస్తాడేమో అన అంద‌రు అనుకున్నారు. కొద్ది సేపటి క్రితం మంచు మనోజ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ‘వాట్ ద ఫిష్’ అనే క్రేజీ సినిమాతో మీ ముందుకు రాబోతున్నా అని పేర్కొంటూ తాను చెప్పాలనుకున్న స్పెషల్ న్యూస్ చెప్పేశారు మంచు మనోజ్. మనం మనం బరంపురం అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. . దాదాపు ఆరేళ్ల బ్రేక్ తర్వాత మునుపటి కంటే రెట్టించిన శక్తితో మంచు మనోజ్ ఈ సినిమా చేస్తున్నారట. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా వదులుతూ తన క్యూరియాసిటీ బయటపెట్టారు మంచు మనోజ్. మ‌రోవైపు అహం బ్ర‌హ్మ‌స్మీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago