శ్రీజ విడాకుల‌పై కొన్నాళ్లుగా వార్త‌లు.. తాజా పోస్ట్‌తో అంద‌రు షాక్..

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. శ్రీజ కళ్యాణ్‌గా ఉన్న తన పేరుని శ్రీజ కొణిదెలగా మార్చుకోవడంతో విడాకుల రూమర్లు మరింతగా ఎక్కువయ్యాయి. ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వేర్వేరుగా ఉంటున్నారని, విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే శ్రీజ తన ఇన్ స్టా ఐడీని మార్చేసిందో ఈ రూమర్లు మరింత బలంగా ఊపందుకున్నాయి. శ్రీజ కళ్యాణ్ దేవ్‌ల మధ్య దూరం పెరిగిందని, మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ బంధం తెగిపోయిందని చెప్పడానికి ఎన్నో కారణాలు చూపిస్తూ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కళ్యాణ్ దేవ్‌ను ఇది వరకు అయితే శ్రీజ, నిహారిక వంటి వారు అంతా కూడా ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు వారు కళ్యాణ్ దేవ్‌ని అన్ ఫాలో చేశారు. దీన్ని కూడా ఓ ఆధారంగా చేసుకుని ఈ విడాకుల రూమర్లను వ్యాప్తి చేస్తున్నారు. మ‌రోవైపు కొంత కాలంగా శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్‌లు త‌మ సోష‌ల్ మీడియాలో చేస్తున్న కొన్ని ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ కూడా వీరి విడాకుల వ్య‌వ‌హారానికి సంబంధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా.. ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ శ్రీజ చేసిన పోస్ట్ నెట్టింట హల్చల్ చేసింది. ఇక అలాగే.. ఐయామ్ లివింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ మరిన్న అనుమానాలకు తావిచ్చింది.

sreeja konidela latest post viral on social media

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. శ్రీజకు త‌న‌కు కాఫీ తాగే అలవాటు ఉన్నట్లు తెలిపింది. “నా అల్లరికి ప్రశాంతతను ఇచ్చేది నువ్వే. జీవితంలో వచ్చే చీకటికి వెలుగులు నువ్వే నింపావ్. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే. 14 ఏళ్ల వయసులో నువ్వు పరిచయం అయ్యావ్. అప్పటి నుంచి నాతోనే ఉంటున్నావ్. థాంక్యూ మై డియర్ కాఫీ” అంటూ శ్రీజ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషనల్లో తన కుటుంబంతో కలిసి శ్రీజ కూడా కనిపించింది. అలాగే అభిమానులతో కలిసి తన అక్క సుష్మితతో కలిసి వాల్తేరు వీరయ్య చిత్రాన్ని వీక్షించి సంద‌డి చేసింది శ్రీజ‌.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago