Manchu Lakshmi : గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ కాగా, ఇందులో మంచు విష్ణు, మనోజ్ గొడవ పడినట్టు అందులో ఉంది. ఈ వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కానీ మోహన్ బాబు వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ డిలీట్ చేశాడు. అయితే అప్పటికే ఆ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ కావడంతో మంచు ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ తెగ చర్చలు సాగాయి.
ఆ సమయంలో ఇదంతా ఫ్రాంక్ వీడియో అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. హౌస్ ఆఫ్ మంచూస్ అనే షోలో భాగంగా ఇదంతా చేసినట్టు ఓ వీడియోను పోస్టు చేశాడు మంచు విష్ణు. కాని అది ఎవరు నమ్మలేదు. ఫ్రాంక్ వీడియో అయితే కెమెరాతో షూట్ చేస్తారు గానీ.. ఫోన్ తో ఎందుకు షూట్ చేస్తారు అంటూ కామెంట్లు పెట్టారు.. ఇక మోహన్ బాబు, మనోజ్‌కి ఈ గొడవలపై ఇటీవల ప్రశ్నలు ఎదురు కాగా, వారు విచిత్రకరమైన సమాధానాలు చెప్పారు. మంచు మనోజ్ అయితే నాకు రీసెంట్ కి సెగ్గడ్డ లేచింది, గోకుతారా? అంటూ సెటైర్ వేశాడు.
ఇవన్నీ చూస్తుంటే మంచు ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ లో ఉందని అందరు అనుకున్నారు. విష్ణు-మనోజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనేది నిజమని పలువురు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపింది. బలగం మూవీ చూసి ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయారట. నిర్మల్ జిల్లాలో భూ వివాదాల కారణంగా 45 ఏళ్ళ క్రితం విడిపోయిన అన్నదమ్ములను బలగం మూవీ ఒక్కటి చేసిందట. అన్నదమ్ములు కలిసిపోయారన్న వార్త నా హృదయాన్ని ద్రవింపజేసిందని.. ఆమె తన కామెంట్‌లో తెలియజేసింది. తన సోదరులు ఇద్దరు గొడవలు పడుతున్న సమయంలో మంచు లక్ష్మీ చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…