I Love You Idiot Movie : కృతిశెట్టి తర్వాత టాలీవుడ్‌లో అంత షార్ట్ టైంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఎవరంటే శ్రీలీల అని చెప్పాలి. `పెళ్లి సందడి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ రెండు సినిమాలకే పెద్ద స్టార్ ఇమేజ్‌ని, విపరీతమైన క్రేజ్‌ని దక్కించుకుంది. చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలు సాధిస్తుండడంతో శ్రీలీల క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఆమె లక్కీ హ్యాండ్‌గా మారిపోయారు. ఆమె నటించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవుతున్నాయి. విరాట్ శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఐ లవ్ యు ఇడియట్’ సినిమా ఇప్పుడు ఆహాలో ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న థియేటర్లోకి వచ్చి మంచి సక్సెస్‌ను సాధించగా, ఇప్పుడు ఈ సినిమా భవానీ మీడియా సంస్థ ద్వారా ఆహాలోనూ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి బత్తుల వసంత సమర్పణలో ఎపి అర్జున్ దర్శకత్వంలో సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి అర్జున్ నిర్మాతలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అవ్వడం, శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాకు ప్లస్‌గా మారాయి. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విరాట్ యాక్షన్, శ్రీలల లుక్స్ యూత్‌ను ఎంతగానో ఇట్టే కట్టిపడేశాయి.
చిత్రంలో శ్రీలీల ఆద్యంతం తన అందచెందాలు, నటనతో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుం ఓటీటీలో ఈ చిత్రం దూసుకుపోతుంది. దుమ్మురేపుతుంది. శ్రీలీలా నటించిన చిత్రం కావడంతో ఆడియెన్స్ కూడా విపరీతంగా చూస్తున్నారు. ఈ సినిమాకు పూర్ణాచారి పాటలు, హరికృష్ణ సంగీతం, అర్జున్ శెట్టి కెమెరా పనితనం కలిసి వచ్చాయి.శ్రీలీల ప్రస్తుతం మహేష్‌బాబు `ఎస్‌ఎస్‌ఎంబీ28`, పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్‌సింగ్`, బాలయ్య `ఎన్బీకే108`, నవీన్ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు`, రామ్, బోయపాటి శ్రీను సినిమాతోపాటు, నితిన్ చిత్రం, కిరీటి `జూనియర్` సినిమా, వైష్ణవ్ తేజ్ మూవీ చేస్తూ చాలా బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…