Manchu Lakshmi : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అమెరికన్ టెలివిజన్ ధారావాహిక లాస్ వేగాస్‌తో హాలీవుడ్ లో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె సరస్వతి కుమార్ పాత్రను పోషించింది. నాలుగు సంవత్సరాల వయస్సులోనే నట జీవితాన్ని ప్రారంభించిన మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రెజెంటర్ గా విభిన్న రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటోంది. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ అనేక విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ మధ్య మంచు లక్ష్మి సినీ పరిశ్రమలో తాను ఎదుర్కున్న సెక్సిజమ్, టైప్ క్యాస్ట్, కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.
మోహన్‌బాబు కూతురినైనా, సినీ పరిశ్రమలో పుట్టి పెరిగినా నాకూ గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి అని మంచు లక్ష్మీ చెప్పింది.. ఇవన్నీ నాక్కూడా జరుగుతాయని మొదట్లో నేను అనుకోలేదు. అయినా వాటి నుంచి తప్పించుకుని నటిగా తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటానని చెప్పింది. ప్రతీ ఇండస్ట్రీ, ప్రతీ రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, బ్యాంకింగ్, ఐటీ ఇలా అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని మంచు లక్ష్మీ తెలిపింది. నా ఫ్రెండ్స్ ఎందరో వాటి గురించి చెబుతుంటారు. ఇక బాడీ షేమింగ్, ట్రోల్స్ అయితే అందరికీ ఎదురవుతుంటాయి. ఎలా ఉన్నా కూడా ట్రోల్ చేస్తుంటారు అని మంచు లక్ష్మీ పేర్కొంది.
అసలే ఈ జీవితం చాలా చిన్నది. అనుకున్నవి చేసేయాలి.. ఈ ట్రోలింగ్, కాస్టింగ్ కౌచ్ ఇవేవీ కూడా మనల్ని ఆపకూడదు. మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. అయితే సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చినా బాడీ షేమింగ్.. కాస్టింగ్ కౌచ్ ను మంచి లక్ష్మీ ఫేస్ చేశానని చెప్పడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు. మోహన్ బాబు కుమార్తెనే అలా ఇబ్బంది పెట్టింది ఎవరు ? అంత ధైర్యం ఎవరికి ఉంది అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…