Coins : హిందువులు పాటించే అనేక ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి దాని వెనుక శాస్త్రీయంగా ఏదో ఒక కారణం ఉంటుందని ఇప్పటికే అనేక సార్లు అనేక విషయాల్లో నిరూపితం చేశారు. అయితే నదుల్లో నాణేలను వేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉంటుంది. సాధారణంగా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు నదులు వస్తే వాటికి మొక్కి కాయిన్స్ వేస్తుంటాం. ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఇప్పుడున్న ఒక రూపాయి, రెండు రూపాయిలు, ఐదు రూపాయల నాణేలు అప్పట్లో ఉండేవి కాదు.. అప్పట్లో అంతా రాగి నాణేలు ఉండేవి. ఆ నాణాలను ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని చాలా మంది నమ్మకం. ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసేవారు. అప్పటి రాజ్యంలో ఉండేవారు ఆ విషయంపై అందరికీ అవగాహన కల్పించారు. రాగి పాత్రలకు, రాగి నాణెలకు నీటిని శుభ్రం చేసే గుణముంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది కూడా.
రాగి నాణేలను వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని.. మనం నీరు తాగేందుకు పనికి వస్తుందని అప్పట్లో ఆ పనిని విధిగా చేసేవారు. ప్రధానంగా పూర్వకాలంలో నదిలో లభించే నీటినే తాగేవారు. పూర్వకాలం నుంచే నాణేలను నదిలో వేసే ఆచారం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం రాగి నాణేలు అన్ని కూడా కనుమరుగు అయ్యాయి. ఇప్పుడు మనం వాడుతున్న నాణాలు నదిలో వేయడం వల్ల అసలు ఉపయోగమే లేదు. వీటి వల్ల నీరు శుభ్రం కాదు. ఇప్పుడు వాడుతున్న నాణాలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నదినీళ్లు పాడయ్యే ప్రమాదముంటుంది.
రైలులో, బస్సులో ప్రయాణించేటప్పుడు పై నుంచి నదిలోకి నాణాలు వేయడం వల్ల కింద ఉండే చిన్నారులు ఇతరులు నాణాల కోసం తమ ప్రాణాలను పణంగా నీళ్లలోకి దూకుతున్నారు. ఇక నుంచి అయినా నదిలో నాణాలు వేయకుండా ఉంటే బెటర్. వాటి వల్ల నదిలో ఉన్న నీళ్లు కూడా పాడవుతాయి. పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నారు. కనుక ఇకపై మీరు ప్రయాణాలు చేసేటప్పుడు నది వస్తే మీద వద్ద రాగి నాణేలు ఉంటేనే వేయండి. ఇప్పటి నాణేలు వేసినా వృథా అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…