Mahesh Babu : నా షాపింగ్ మొత్తం న‌మ్ర‌తనే చేస్తుంది.. చెప్పేసిన‌ మ‌హేష్ బాబు

Mahesh Babu: గౌరీ సిగ్నేచర్స్​ అటేలియర్​.. తాజాగా హైదరాబాద్​వాసులకు అందుబాటులోకి వచ్చింది. వివాహ వస్త్రాలకు సంబంధించిన ఈ గౌరీ సిగ్నేచర్స్​ని రీసెంట్‌గా ప్రముఖ నటుడు మహేశ్​ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్​లు ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ బాబు చాలా ఆస‌క్తిగా మాట్లాడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సరదా మనిషి. ఆయన ఎంత అందంగా ఉంటారో… ఆయన మాటలు కూడా అంతే అందంగా ఉంటాయి. ఆ మాటల్లో ఛలోక్తులు, పంచ్ డైలాగ్స్ కూడా అలవోకగా వచ్చేస్తాయి. సినిమాలకు సంబంధించిన ప్రెస్‌ మీట్స్‌లో మహేష్ బాబు కనిపించడం కామన్! అలాగే, తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే ప్రోడక్ట్స్ ప్రెస్‌ మీట్‌లలో కూడా! బట్, ఫర్ ఏ ఛేంజ్… ఫస్ట్ టైమ్ సతీమణి నమ్రతతో కలిసి లగ్జరీ & కస్టమైజ్డ్ వెడ్డింగ్ డ్రస్, జ్యువెలరీ స్టోర్ ప్రారంభోత్సవంలో మహేష్ బాబు తెగ‌ సందడి చేశారు.

ఇక మ‌హేష్ బాబు మాట్లాడుతూ…. మా ఆవిడతో ఇలా ప్రెస్ మీట్ కి రావడం అని తన స్పీచ్ స్టార్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. ఆయన పక్కన కూర్చున్న నమ్రత కూడా! ఉదయ్, శ్రీనివాస్ తమ స్నేహితులు అని, వాళ్ళ కోసం తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. తనకు కంపెనీ ఇవ్వడానికి మహేష్ బాబు గౌరీ స్టోర్ ఓపెనింగుకు వచ్చారని నమ్రత తెలిపారు. ఆ తర్వాత మహేష్ బాబును ‘స్టోర్ మొత్తం చూశారు కదా! ఒకవేళ మీ వైఫ్ కోసం ఏ శారీ సెలెక్ట్ చేస్తారు? ఆవిడ కోసం మీరు షాపింగ్ చేస్తారా?’ అని అడిగితే… ”సాధారణంగా తన కోసం నేను షాపింగ్ చేయను. నా కోసమే తాను షాపింగ్ చేస్తుంది. ఒకవేళ అవకాశం ఇస్తే… ఇప్పుడు ఈ స్టోరులో ఉన్నవి అన్నీ సెలెక్ట్ చేస్తుంది” అని చెప్పారు.

ఆ తర్వాత మైక్ తీసుకున్న నమ్రత… ”ఈ రోజు మహేష్ జేబుకు గట్టిగా చిల్లు పడటం ఖాయం” అని నవ్వేశారు. అంటే… మహేష్ బాబుతో షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టిస్తానని పరోక్షంగా అలా చెప్పుకొచ్చారు. ఇక మ‌హేష్ ప్ర‌స్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. దీని తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య మరొక సినిమా చేసే అవకాశం ఉందని ఆ మధ్య ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపించింది. వార్తలు వచ్చాయి కూడా! అయితే… అటువంటిది ఏమీ లేదని మ‌హేష్ స‌న్నిహితులు చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago