Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలు, ఇటు కమర్షియల్ యాడ్స్‌తో దుమ్ము లేపుతున్నాడు. కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈయన..ఇటీవల 43 ఏళ్ల ప్రస్థానం కూడా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఉగాది రోజున.. అంటే మార్చి 22న ఈ మూవీ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఉగాది పండగ అంటేనే తెలుగు వారికి కొత్త సంవత్సరాన్ని తీసుకొచ్చే పర్వదినం కావడంతో ఆ రోజున టైటిల్ రివీల్‌కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు టాక్.
ఇక సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో యాడ్స్‌లోను మెరుస్తూ వస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు గతంలో థమ్స్ అప్ కూల్‌డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే వారు. ప్రస్తుతం ఆయన మౌంటెన్ డ్యూకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నా నేపథ్యంలో మౌంటెన్ డ్యూకు సంబంధించిన ఓ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహేష్ పవర్ ఫుల్ రియాక్షన్స్ ప్రేక్షకులకి పూనకాలు తెప్పిస్తున్నాయి. మహేష్ బాబు తన అధికారిక యూట్యూబ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.
ఈవీడియో నాలుగు గంటల్లో 25వేలకుపైగా వ్యూస్.. వందల సంఖ్యలో కామెంట్లు సంపాదించుకుంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న మహేష్ అభిమానులు.. వెరైటీ కామెంట్స్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో యాడ్ షూట్ చేశారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ ..త్రివిక్రమ్ మూవీ తర్వాత . రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమా ప్యాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుంది. హాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఇండియానా జోన్స్ సిరీస్‌లా మహేష్, రాజమౌళి సినిమా ఉండనుందని తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…