Hamsa Nandini : గ్లామర్ పరిశ్రమలో తారలు ఎందో అందంగా కనిపిస్తూ ప్రేక్షకులని ఎంతో అలరిస్తూ ఉంటారు. కాని పర్సనల్ విషయానికి వచ్చే సరికి ఎన్నో బాధలు ఉంటాయి. సినీ పరిశ్రమలోని కొందరు తారలు క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. మనీషా కోయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్ వంటి హీరోయిన్స్ క్యాన్సర్ మహామ్మారి నుంచి కోలుకుని.. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించగా, ఇప్పుడు వారి లిస్ట్‌ల టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని కూడా చేరింది.. అనుమానస్పదం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హంసానందిని క్యాన్సర్ బారిన పడింది. కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్న హంసానందిని ఇటీవలే ఈ మహామ్మారిని జయించి ప్రస్తుతం సరదాగా గడుపుతుంది. మునుపటిలా తన జుట్టు పూర్తి స్థాయిలో వచ్చింది అనే విషయాన్ని తెలియాజేస్తూ హంసా నందిని ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఏడాది క్రితం జుట్టు లేకుండా.. ఏడాది తర్వాత జుట్టుతో ఎలా ఉన్నానో చూడండి హంస నందిని ఆ వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తన లేటెస్ట్ గ్లామర్ లుక్ ని బయట పెట్టిన హంసా నందిని తన ఫీలింగ్ చాలా బావుందని తెలియజేసింది.
హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత స్పెషల్ సాంగ్స్‌తో తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హంసానందిని. 2007లో వంశీ తెరకెక్కించిన అనుమానాస్పదం అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ అనందరం అధినేత, ప్రవరాఖ్యుడు, అహనా పెళ్లంట,ఈగ తదితర సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది. ఆతర్వాత మిర్చి, భాయ్, రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యమ్, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు సినిమాల్లో స్పెషల్ సాంగులతో అలరించింది. మధ్యలో రుద్రమదేవి, పంతంలాంటి సినిమాల్లోనూ కీలక పాత్రలు కూడా పోషించింది. కాగా సినిమాలు, స్పెషల్ సాంగులతో బిజీగా ఉన్న ఈ అందాల తార 2021 డిసెంబర్‌లో తాను క్యాన్సర్ బారిన పడినట్టు చెప్పి అందరికి షాకిచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…