Mahesh Babu : చిత్ర పరిశ్రమ అంటేనే ఓ చిత్రమైన ఫీల్డ్. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఆ బ్రహ్మ దేవుడికే తెలియదు. ఏ స్టార్ హీరో ఎలాంటి చిన్న డైరెక్టర్ తో సినిమా చేస్తాడో కూడా ఊహించలేము. అలాంటి సినిమాల్లో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్రం, నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాలతో యువతుల్లో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. ఇక అప్పుడు ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే చేస్తే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
అయితే కెమెరామెన్ ఆదిత్య దగ్గర ఉన్న కథ గురించి నిర్మాత ఎంఎస్ రాజు చెప్పాడట. దీంతో వెంటనే దర్శకుడు ఆదిత్యకు ఫోన్ చేసి కలవాలంటూ అడిగాడట నిర్మాత ఎంఎస్ రాజు. కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునే వాడట. తాను ఒక లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి పరిచయం కావాలని అనుకుంటున్నాను అంటూ ఓ సమయంలో నిర్మాత ఎంఎస్ రాజుకు చెప్పారట ఆదిత్య.
ఈ క్రమంలోనే బాలీవుడ్ లో వచ్చిన అన్మోల్ గాడి సినిమాకు తెలుగు కథను సిద్ధం చేశాడు. మనసంతా నువ్వే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక అప్పటికి ఈ సినిమా కోసం మహేష్ బాబు డేట్ లు కూడా ఇచ్చారట. కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం కొత్త కుర్రాడు అయితే బాగుంటుందని అనుకున్నాడట. ఇలాంటి సమయంలోనే చిత్రం సినిమా చూసిన దర్శకుడు ఆదిత్య ఇతనే హీరో అయితే బాగుంటుంది అని అనుకోవడంతో మహేష్ బాబుని కాదని ఉదయ్ కిరణ్ తో సినిమా చేశారు. దీంతో మూవీ హిట్ అయింది. అలా మహేష్ కాకుండా ఆ మూవీని ఉదయ్ కిరణ్ చేయాల్సి వచ్చింది. అతనికి ఆ మూవీ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…