గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్‌తో పాన్ వరల్డ్ ప్రేక్షకులను ఈ చిత్రంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ విడుదలయ్యే దాకా తన గత చిత్రాలను హిందీలోకి డబ్ చేసి థియేటర్‌లలో రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు సమాచారం. ఇప్పటి వరకు మహేశ్ నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు. దీంతో బాలీవుడ్‌లో ఇదే తన తొలి చిత్రమవుతుందని ఆసక్తిగా ఉన్నారు.
కాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉండగా మహేష్ బాబు తన కొత్త లుక్ లోకి మారే పనిలో ఉన్నాడు. అలాగే వచ్చే ఏడాది నుంచి అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోనుందట. వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేసుకుంటుంది అని అలాగే ఒక గ్లొబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇది రాజమౌళి ఎప్పుడో ఆపేసిన ప్రాజెక్ట్ “గరుడ” అంటూ కూడా పలు రూమర్స్ ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అయితే దుర్గ ఆర్ట్స్ వారు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారని ఒక అంచనా.
అయితే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌కి కాస్త బ్రేక్ తీసుకొని న్యూయార్క్ వెళ్లారు. వెకేషన్ పూర్తి కాగానే తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. కూతురు సితారతో కలిసి మహేష్ బాబు ఎయిర్ పోర్ట్‌లో నడుస్తూ వస్తుండగా, అందుకు సంబంధించిన లుక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. రెడ్ క్యాప్, క్యాజువెల్ వేర్, జులపాల గడ్డంతో మహేష్ బాబు లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…