కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆఫీస్‌లోనే ఇప్పటి వరకు తను బస చేస్తున్న బిల్డింగ్‌నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోనున్నారు. విజయవాడలోని ఇరిగేషన్ భవన్‌ను డిప్యూటీ సీఎంగా, కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ క్యాలణ్‌కు ప్రభుత్వం కేటాయించింది. అక్కడే వరుస సమీక్షలు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అక్కడ సమస్యలు ఎదురవుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు.

కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ కు విజయవాడలోని జలవనరులశాఖకు చెందిన గవర్నర్ పేట క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మొదట్లో ఇక్కడకు వచ్చిన పవన్.. ఆ తర్వాత మాత్రం క్రమంగా దూరమయ్యారు. ప్రస్తుతం మంగళగిరిలోని తన నివాసంలోనే ఎక్కువగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఫర్నిచర్ తో సహా భవనం వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పవన్ అందులో తెలిపారు.ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనానికి వెనుకాలే కోర్టుల సముదాయం ఉంది. అందుకే అక్కడకు వెళ్లి వచ్చే వారికి పవన్ కల్యాణ్‌ రాకపోకలతో ఇబ్బందిగా మారుతుందని ఫిర్యాదులు అందాయి.

pawan kalyan took important decision on his residence

పవన్ వచ్చి వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ నిలిపేయడం, అధికారుల రాకపోకలతో కూడా కోర్టులకు వెళ్లే వచ్చే వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన దృష్టికి వచ్చింది.ప్రజలు పడుతున్న ఇబ్బంది గమనించిన పవన్ కల్యాణ్‌ ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భావించారు. గత కొద్ది రోజులుగా పార్టీ దగ్గర ఉన్న తను బస చేసే బిల్డింగ్‌లోనే సమీక్షలు నిర్వహించారు. ఇకపై దాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అధికారికంగా తనకు కేటాయించిన భవనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago