ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక ప్రభుత్వానికి పలువురు ప్రముఖులు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. సోమవారం విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఆయన కలిశారు. వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ అధినేతను సీఎం చంద్రబాబు అభినందించారు.
75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం కష్టపడుతున్నారని కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. విపత్తు వేళ ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు.మరోవైపు కొవిడ్ సమయంలోనూ కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ఏపీకి భారీ విరాళం అందించారు. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు. ఇప్పుడు మరోసారి విపత్తు వేళ అండగా నిలిచారు. ఇక వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పోటెత్తుతున్నాయి. రంగాలకు అతీతంగా విరాళాలు అందిస్తున్నారు. సినీ రంగం నుంచి చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖులతో పాటుగా చిన్న నటులు కూడా తమకు తోచినైన స్థాయిలో విరాళం అందించారు.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వంటి నేతలు కూడా భారీగా విరాళాలు ఇచ్చారు.ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సాయం వారు చేయాలి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఎవరికి తోచినంత వారు సాయం అందిస్తే ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటుందని కిరణ్ కుమార్ అన్నారు. కాగా, వరద బాధితుల సహాయార్థం టీడీపీ నేత అంగర్ రామ్మోహన్ రావు విరాళం అందించారు. విజయవాలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఆయనను సీఎం చంద్రబాబు అభినందించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…