OTT : ఈ మధ్య థియేటర్స్‌లో కన్నా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. గత రెండు వారాలు విడుదలైన సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను బాగా అలరించడంతో ఈ వారం ఏయే సినిమాలు విడుదల అవుతాయి అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈవారం కూడా ఓటీటీ, థియేటర్లో పలు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఓటీటీ విషయానికి వస్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, హాట్‌స్టార్, సోనీ లివ్ మరియు ఇతర ఒటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సందడి నెలకొననుంది.
ఫిఫా ప్రపంచకప్ ఈ నెల 20న ప్రారంభం కానుండగా,దీనిని భారతీయులు జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చు. ఇక మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ చుప్ చుప్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుంచి జీ5లో ప్రసారం కానుంది. ఇక మీట్ క్యూట్ ఆంథాలజీ అనే చిత్రం నవంబర్ 25 నుండి సోనీ లివ్‌లో ప్రత్యేకంగా ప్రసారం చేయబడుతుంది. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మానవ భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది.
కాంతారా ది కన్నడ బ్లాక్‌బస్టర్ భారీ పాన్ ఇండియన్ మూవీ ఈ నెల 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రిన్స్ . జాతి రత్నాలు ఫేం అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. సినిమాల విషయానికి వస్తే ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం అనే సినిమా ఈనెల 25న థియేటర్లో విడుదల కానుంది.ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు.ఇక ఈ సినిమా ప్రజల కోసం పోరాడి నాయకుడి కథతో రానుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన సినిమా భేడియా.ఇక ఈ సినిమా తెలుగులో తోడేలు పేరుతో 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…