Allu Sneha Reddy : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిపోయింది. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పడింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప ది రూల్ మూవీలో నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పుష్ప ది రైజ్ మూవీ కి సీక్వెల్ గా రూపొందనున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది.
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇక పుష్ప 2 మూవీలో తన పాత్ర కోసం ఇప్పటికే మేకోవర్ పరంగా తనని తాను సిద్ధం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంత ప్రియారిటీ ఇస్తాడో తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే చాలు.. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేస్తాడు. ఎక్కువ సమయం పిల్లలతోనే గడపడానికి ప్రయత్నిస్తాడు. సినిమాల పట్ల ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీ టైమ్ ను మాత్రం అస్సలు మిస్ కాడు.
ముఖ్యంగా బన్నీకి తన కూతురు అల్లు అర్హ అంటే ప్రాణం. కూతురితో ఎంత సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసిందే. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఓ వెడ్డింగ్‌కి వెళ్లిన బన్నీ.. భార్య స్నేహరెడ్డితో కలిసి దిగిన పిక్‌ని సోషల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ట్వీటర్‌తో పాటు ఇన్‌స్టా స్టోరీలో ఆ ఫోటోని షేర్ చేస్తూ.. హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఉనక్కుళ్ నాన్ సాంగ్ ని కూడా జత చేశాడు. సతీమణితో కలిసి అందంగా దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…