రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ మూవీ ఎంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. సినిమా వీరిద్దరి కెరీర్‌లోనూ అత్యంత చెత్త సినిమాగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే విడుదలకు ముందు వీరు చేసిన అతి వల్ల ఇప్పుడు నెటిజన్లు వీరిని ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇంతటి సినిమాకే అంత బిల్డింగ్ ఎందుకు ఇచ్చినట్లు.. అని ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా ఫ్లాప్ అయింది కనుక త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.
లైగర్ డిజిటల్ హక్కును ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే సినిమా హిట్ అయి ఉంటే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 50 రోజుల తరువాతే ఓటీటీలోకి వచ్చేది. కానీ ఫ్లాప్ అయింది కనుక మరో 3 వారాల్లోనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే లైగర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై త్వరలోనే ఒక తేదీని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ఇక లైగర్ మూవీ విడుదలకు ముందు రూ.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. అందులో రూ.45 కోట్లు అయినా కలెక్ట్ చేస్తుందా.. అని అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అట్టర్‌ఫ్లాప్ వల్ల నిర్మాత పూరీకి తీవ్రమైన నష్టం వచ్చిందని అంటున్నారు. మరోవైపు ఇందులో చార్మి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. కనుక ఆమెకు కూడా తీవ్రంగా నష్టమే వాటిల్లిందని అంటున్నారు. ఇక మరో 3 రోజులు గడిస్తేనే కానీ.. సినిమా అసలు లెక్కలు బయటకు రావు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…