పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు నిజంగా ఇది మంచి కిక్ ఇచ్చే వార్తనే అని చెప్పవచ్చు. హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ ఆగిపోవడంతో డీలాపడిపోయిన పవన్ అభిమానులు ఇప్పుడు లేచి డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే.. ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అవును.. వచ్చే నెలలోనే ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే దర్శకుడు క్రిష్ ఓ భారీ సెట్‌ను వేయించే పనిలో పడ్డారట. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలోనే హరిహర వీరమల్లు షూటింగ్ మళ్లీ మొదలవుతుందని అంటున్నారు.
వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో జరిగి ఈపాటికే సినిమా విడుదల కావల్సి ఉంది. కానీ కరోనాతోపాటు అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మధ్యే షూటింగ్ మళ్లీ ప్రారంభం అయినా దర్శకుడు క్రిష్, పవన్ ల మధ్య విభేదాలు వచ్చాయని తెలిసింది. పవన్ చెప్పినట్లు దర్శకుడు క్రిష్ కొన్ని సీన్లలో మార్పులు చేయలేదట. దీంతో పవన్ అసంతృప్తి చెంది షూటింగ్‌కు రాలేనని చెప్పారట. అయితే నిర్మాత ఏఎం రత్నం ఇద్దరికీ సయోధ్య కుదిర్చారని సమాచారం. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
అయితే ఈసారి షూటింగ్‌కు పవన్ కేవలం 20 రోజుల డేట్స్‌ను మాత్రమే ఇచ్చారట. అందువల్ల ఆ సమయంలోనే సినిమాను పూర్తి చేయాలి. లేదంటే మరో 6 నెలల పాటు వేచి చూడక తప్పదు. ఎందుకంటే పవన్ అక్టోబర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బస్సు యాత్ర చేయనున్నారు. 6 నెలల పాటు ఆ యాత్ర ఉంటుంది. కనుక ఆ యాత్రకు ముందే మూవీ షూటింగ్ పూర్తవ్వాలి. లేదంటే విడుదల కూడా వాయిదా పడుతుంది. ఇప్పటికే చిత్ర విడుదలను వచ్చే ఏడాది మార్చి 10వ తేదీకి మార్చారు. మరి ఆ రోజున అయినా మూవీ రిలీజ్ అవుతుందో.. లేదో.. వేచి చూస్తే తెలుస్తుంది.
ఇక హరిహరవీరమల్లు మూవీని పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పవన్ ఇందులో భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. 17వ శతాబ్దంలోని మొఘల్ ల సామ్రాజ్యం నేపథ్యంలో హరి హర వీరమల్లు కథ సాగుతుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ లు జంటగా నటిస్తున్నారు. పలు కీలక పాత్రల్లో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…