Leg Cramps At Night : మనం రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. కానీ చాలా మంది పోషకాహారం తినడం లేదు. దీంతో అనేక వ్యాధులు వస్తున్నాయి. ఇక పోషకాలు లోపించడం వల్ల మనలో అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. కాలి పిక్కలు పట్టేయడం కూడా అలాంటి ఒక లక్షణమే. నిద్రలో ఉన్నప్పుడు మనకు ఎక్కువగా ఇలా జరుగుతుంది. నిద్రలో ఉన్నప్పుడు కాలిని పైకి ఎత్తితే ఇలా జరుగుతుంది. దీంతో ఆ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఒక పట్టాన తగ్గదు. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇలా చాలా మందికి తరచూ జరుగుతూనే ఉంటుంది.
అయితే నిద్రలో ఉన్నప్పుడే కాకుండా చాలా మందికి రోజులో పగటి పూట కూడా ఇలాగే జరుగుతుంది. ఇక ఇందుకు మెగ్నిషియం లోపాన్ని ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మెగ్నిషియం లోపించడం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో ఎక్కువ సేపు కూర్చోలేరు. నిలబడలేరు. తిమ్మిర్లు వస్తుంటాయి. అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. నరాల మీద ఒత్తిడి పడుతుంది. దీంతో ఇలా పిక్కలు పట్టేస్తుంటాయి. ఇలా జరగడానికి మెగ్నిషియం లోపమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక మెగ్నిషియం ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఈ నొప్పులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ అద్దుతూ కాపడం పెట్టాలి. దీనివల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ కింద దిండ్లు పెట్టుకుని కాళ్లు ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. కాళ్లు బాగా చాచి అటూ ఇటూ కదుపుతూ తేలికపాటి వ్యాయామాలు చేస్తే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇక మెగ్నిషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అంటే పాలకూర, గుమ్మడికాయ విత్తనాలు, బాదం పప్పు, పెరుగు, ఆకుకూరలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆనపకాయ, బూడిద గుమ్మడికాయ నొప్పులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇలాంటి నొప్పులు రావడానికి రక్తహీనతను కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కాబట్టి రక్తహీనత సమస్య ఉందేమో ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. రక్తహీనత ఉంటే అప్పుడు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో సమస్య తగ్గుతుంది. అలాగే థైరాయిడ్ కూడా ఇందుకు ఒక కారణం. కనుక ఏం చేసినా ఈ నొప్పులు పోవడం లేదంటే.. థైరాయిడ్ ఉందేమోనని అనుమానించాలి. పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ ఉందని వస్తే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో కాలి పిక్కలు పట్టేయడం తగ్గుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…